పిల్లలు పెద్దవారయితే

girl

పిల్లలు పెద్దవారయితే

చిన్న పిల్లలు అల్లరి చేస్తేనే అందం. అలా అని మరీ శతిమించితే తలలు పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు వీళ్లు పెద్దవాళ్లెప్పుడవుతారా అని అనుకోవడం సహజం. కానీ చిన్నవాళ్లుగా ఉంటేనే బాగుండు అనుకునే సందర్భాలూ కొన్నిసార్లు ఉంటాయి. అలాంటి సందర్భాలు రావడానికి కారణాలు ఇవి- ్య మీకు అన్ని విషయాలూ తెలియవని వారికి అర్థమవుతుంది.

కొన్ని విషయాలు వారే మీకు వివరించగలుగుతారు. ్య మీ కంటే బాగా పొడుగవడం వల్ల వారితో కలిసి వెళ్లడానికి మీరు కాస్త ఇబ్బంది పడతారు. ్య ముద్దుగా దగ్గరికి తీసుకుని చెబితే వినేస్థాయి దాటిపోయి ఎంత చెప్పినా వారి డిమాండ్లు నెరవేర్చాలని మంకుపట్టు పడతారు. ్య పుట్టినరోజులకు మీరిచ్చే బహుమతులు వారిని ఆశ్చర్యానికి, ఆనందానికి లోను చెయ్యవు సరికదా, వారవి కోరుకోరు. డబ్బులిస్తే ఇష్టమైన వస్తువులు మేమే కొనుక్కుంటాం అంటారు.

అమ్మా..అమ్మా.. అంటూ మీ చుట్టూ తిరుగుతూ అన్ని విష§2ూలు మీకు చెప్పేవాళ్లు మీ దగ్గర రహస్యాలు దాస్తారు ్య వర్షాకాలపు సాయంత్రాలు, చలికాలపు సాయంత్రాలు మిమ్మల్ని కౌగిలించుకుని వేడివేడిగా ఏమైనా చేసిపెట్టమనే గారాలు, కథల పుస్తకాలు చదివించుకునే రోజులు, ఇద్దరు కలిసి టీవీలో టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి కార్టూన్‌ షోలు చూసే రోజులు లేకపోవడం.

ఇష్టపడే విషయాలు ్య బజారునుండి కూరగాయలు, ఇంటికవసరమైన సామగ్రి తేవడం, కరెంటుబిల్లు కట్టడానికి లేదా చిన్న చిన్న పనులకు మీ భర్తల మీద ఆధారపడాల్సి రాకపోవడం లేకపోతే మీరే పరిగెత్తాల్సిరావడం లాంటివి తప్పడం. ్య పిల్లలు ఇంట్లో ఒక్కరే ఉన్నారని దిగులు పడాల్సిన అవసరం లేకపోవడం. ్య వారికిష్టంలేని కూరగాయలు కూడా రకరకాలుగా వండి వారితో తినిపించే అవసరం లేకపోవడం.