పిల్లలకు పర్యావరణంపై అవగాహన కలిగించాలి

Kadiyam srihari
Kadiyam srihari

హైదరాబాద్‌: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను డిప్యూటి సియం కడియం శ్రీహరి కోరారు. హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేసే సంకల్పంతో విద్యాశాఖ పనిచేస్తుందని, విద్యార్ధులకు పర్యావరణంపై అవగాహన కల్పించాలని కడియం సూచించారు. మొక్కల పరిరక్షణ బాధ్యతలను విద్యార్థులకు అప్పగించాలన్నారు. మొక్కల బాధ్యతలు ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలన్నారు. గ్రీన్‌ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేసి నాటిన మొక్కలను వంద శాతం పరిరక్షించాలని పాఠశాలల యాజమాన్యాలకు కడియం నిర్ధేశించారు.