పిడుగుపాటుకు ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

RAIN
RAIN

పిడుగుపాటుకు ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

అనకాపల్లి (విశాఖపట్నం): అన్నెం పుణ్యం ఎరుగని ఇద్దరు విద్యార్థులు క్రికెట్‌ ఆటకు వెళ్లి దుర్మరణం పాలయ్యారు. అనకాపల్లి మం డలం తమ్మయ్యపేట గ్రామంలో క్రికెట్‌ మ్యాచ్‌కు వెళ్లి వర్షం పడుతుందని గ్రహించి చెట్టు కింద నిలబడిన క్రికెట్‌ టీమ్‌ అంతా నిల్గొని ఉండటంతో పిడుగు పెనుభూతం ఇద్దరి విద్యార్థులను దుర్మరణం పాల్జేసింది. కశింకోట మండలం విసన్నపేట గ్రామానికి చెందిన పోలిన హేమంత్‌ (17), నగిశెట్టి పవన్‌ (19)లు అనకాపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామానికి క్రికెట్‌ ఆడేం దుకు వచ్చారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆకాశమంతా మేఘా వృతమవ్వడం అయిదు గంటలకు పిడుగులు మండలంలోని అనేకచోట్ల పడ టంతో పడిన వాటిలో తమ్మయ్యపేట గ్రామంలో క్రికెట్‌ ఆడుతున్న విద్యా ర్థులపై పడిపోవడంతో వీరిద్దరి అక్కడి కక్కడే మృతిచెందారు. ఈ విద్యార్థుల్లోహేమంత్‌ ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంటే, పవన్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
====