పిజ్జా2 ఆడియో రిలీజ్‌ కు సిద్ధం!

PIZZA2
PIZZA2

పిజ్జా2 ఆడియో రిలీజ్‌ కు సిద్ధం!

తమిళ పాపులర్‌ హీరో విజ§్‌ుసేతుపతి నటిస్తున్న తమిళచిత్రం పురియత్‌ పుధీర్‌ ను పిజ్జా-2 పేరుతో.. శ్రీమతి లత సమర్పణలో ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో, డీవీ సినీ క్రియేషన్స్‌ సంస్థ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత డి.వెంకటేష్‌ తెలియజేస్తూ.. ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందించబడింది. ఈ నెల 11న ఈ చిత్ర తెలుగు థ్రియేట్రికల్‌ ట్రైలర్‌, 14 న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా వుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఇదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే wస్కీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్‌ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు అని తెలిపారు.