పిఎస్‌బిలోన్‌పోర్టల్‌పై రూ.5కోట్లవరకూ రుణం

money
money


న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: బ్యాంకులు రిటైల్‌ రుణాలకోసం అందిన దరఖాస్తులను పిఎస్‌బిలోన్స్‌59 మినిట్స్‌ పోర్టల్‌పై మంజూరుచేయడం ప్రారంభిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో అనేక వనరులనుంచి మొత్తం సమాచారం సేకరించిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు, బ్యాంకు నివేదికలు ఇతరత్రా సమగ్రపరిశీలనచేసి 59 నిమిషాల్లోనే రుణాలు అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.తొలుత కోటిరూపాయలవరకూ ఉన్న ఈరుణపరపతిని ఇపుడు ఐదుకోట్లవరకూ పెంచారు. ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఇ రంగానికిగాను ఈ రుణపరపతిని మరింత సులభతరంచేసేందుకు వీలుగా ఈ పరపతిని ఉంచారు. ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలకు సుమారు కోటి రూపాయలవరకూ ఈ పోర్టల్‌ద్వారా రుణపరపతిని అందిస్తారు. చిన్న చిన్న వ్యాపారులకు తక్షణరుణపరపతికోసం ఈ పోర్టల్‌ను గత ఏడాది ప్రారంభించారు.

మొత్తం 19 ప్రభుత్వరంగ బ్యాంకులు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బిఐ, పంజాబ్‌నేషనల్‌బ్యాంకు, బ్యాంక్‌ఆఫ్‌ బరోడా, యూనియన్‌బ్యాంకులు ఇపుడు ఈపోర్టల్‌పై రుణప్రతిపాదనలను పరిశీలిస్తున్నాయి. డిజిటల్‌ విధానంలో కస్టమర్లు తమకు అనువైన బ్యాంకునుసైతం ఎంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల గృహ, వ్యక్తిగత రుణాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంజూరుచేయించుకనే అవకాశం ఉంటుంది. ఎస్‌బిఐ ఎండి పికె గుప్తా మాట్లాడుతూ బ్యాంకర్లు మరిన్ని ఉత్పత్తులను ఈపోర్టల్‌ద్వారా ప్రారంబించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఇ రంగానికి అనువైన ఈరుణపరపతిని ఇకపై ప్రతి ఒక్కరికీ అందుబాటులోనికి తెస్తామని వెల్లడించారు. పిఎస్‌బిలోన్స్‌ఇన్‌ 59 నిమిషాలు పోర్టల్‌కింద అందిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తారు. ఒకసారి దరఖాస్తును అప్‌లోడ్‌చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో ఉన్న ఆల్గోరిథమ్స్‌ ద్వారా మొత్తం పరిశీలన జరుగుతుంది. రుణమొత్తం మంజూరుచేయవచ్చా అన్న అంశాలనుపరిశీలిస్తారు. 2018 నవంబరులో ప్రభుత్వం ఈపోర్టల్‌ను ప్రారంభించింది. ఎంఎస్‌ఎంఇ రంగానికి కోటి రూపాయలవరకూ కేవలం 59 నిమిషాల్లోనే మంజూరుచేసేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంబించారు. తాజా గణాంకాలప్రకారం సుమారు 50,706 దరఖాస్తులు అందాయి. వీటిలో 27,893 దరఖాస్తులనున ఆమోదించి రుణం మంజూరుచేసినట్లు తెలింది. వీటిని 2019 మార్చినాటికి అందచేసారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/