పాల‌క టిఆర్ఎస్‌కు నాగం స‌వాల్‌

Nagam Janarthan reddy
Nagam Janarthan reddy

మహబూబ్‌నగర్‌: ముందస్తు ఎన్నికలను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 75 సీట్లు గెలవబోతోందని స్పష్టం చేశారు. అదే సమావేశంలో పాల్గొన్న నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో 6లక్షల ఎకరాలకు నీరిచ్చినట్లు టీఆర్‌ఎస్‌ మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం 2లక్షల ఎకరాలకు నీరిచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని నాగం సవాల్ విసిరారు.