పాలి ఉమ్రిగ‌ర్ అవార్డును నాలుగుసార్లు గెలిచిన కోహ్లి

virat kohli
virat kohli

ముంబైః టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. వరుసగా నాలుగో ఏడాది కూడా బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌కు బీసీసీఐ ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డుకు కోహ్లిని ఎంపిక చేశారు. ఈ అవార్డును నాలుగుసార్లు గెలిచిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. జూన్ 12న జరగనున్న బీసీసీఐ అవార్డు సెర్మనీలో కోహ్లికి అవార్డు ఇవ్వనున్నట్లు బోర్డు గురువారం వెల్లడించింది.