పాలకూర, బఠాణీ సూప్‌

Soup
Soup

పాలకూర, బఠాణీ సూప్‌

కావలసినవి

పాలకూర- 8కట్టలు పెసరపప్పు-ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు-రెండు పాయలు అల్లం – చిన్నముక్క, వెల్లుల్లి-రెండు రెబ్బలు పచ్చిమిరపకాయ-రెండు జీరా, మిరియం పొడి-ఒక టేబుల్‌ స్పూన్‌ ఉప్పు, పసుపు-తగినంత పచ్చిబఠాణీలు-ఒక కప్పు

తయారుచేసే విధానం

పచ్చిబఠాణీలు ఉప్పువేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన నీరు పారబోయ కూడదు. సూప్‌లోకి పనికి వస్తుంది. పెసరపప్పును శుభ్రంగా కడగాలి. ఈ పప్పును సన్నగా తరిగిన పాలకూర ఉల్లిపాయ ముక్కలు, అల్లం,వెల్లుల్లి, మిర్చి ముక్కలు అన్నింటిని కలిపి కుక్కర్‌ గిన్నెలో వేసి, ఉప్పు, పసుపు, కలిపి ఒక కప్పు నీళ్లు చేర్చి కుక్కర్‌ మూసి స్టవ్‌మీద పెట్టాలి. రెండు విజిల్స్‌ వస్తే చాలు ఉడికిపోతుంది. వేడి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మెత్తని ముద్దని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని నాలుగు కప్పుల నీరు జేర్చి జీరా మిరియం పొడి ఒక టీస్పూన్‌ వేసి బఠాణీ గింజలు వేసి ఒక్క ఉడుకు రానీయాలి. తరువాత దించి నిమ్మరసం పిండి వేడివేడిగా సర్వ్‌ చేయాలి. ప్రొటీన్స్‌, విటమిన్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఆకలి పుట్టిస్తుంది. రక్తవృద్ధి. పిల్లలకి కావాలంటే రుచికి కొంచెం బటర్‌కాని, క్రీం కాని కలిపి తినిపించవచ్చు. ఆకుపచ్చని రంగుతో తినడా నికి కూడా చాలా రుచిగా ఉంటుంది.