పాలకుల ఫీట్లు…పేదల పాట్లు

ఒక్కమాట
                                పాలకుల ఫీట్లు…పేదల పాట్లు

Modi
Modi

సమాజం అయినా, వ్యవస్థ అయినా, దేశం అయినా ప్రజారంజకంగా పురోగమించాలంటే సమర్థమైన నాయకత్వం అవసరం అనేది నిర్వివాదం. ఎన్ని వనరులున్నా, మరెంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వాటిని ప్రజావసరాలకు త్రికరణశుద్ధిగా రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న నాయకత్వం లభిస్తేనే అభ్యున్నతికి బాటలు పడతాయి. గత ఎన్నికల సమయంలో బిజెపి నేత ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయనకు, ఆయన పార్టీకి పట్టం కట్టారు. ఇక భారత్‌కు తిరుగులేని నాయకుడిగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటారని అందరూ ఊహించారు. కానీ ఎందుకోఏమో రానురాను పరిస్థితులు అందుకు విరుద్ధంగా పయనిస్తు న్నాయేమో ననిపిస్తున్నది. ఆయన ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కొక్కటి వికటిస్తున్నాయి. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
‘కొడుకు గుణం పెళ్లితర్వాత, భర్త గుణం భార్య అనారోగ్యంలో, భార్య గుణం భర్త పేదరికంలో, పిల్లల గుణం వృద్ధాప్యంలో, అలాగే నాయకుల గుణం అధికారంలో ఉన్నప్పుడు తెలుస్తుందంటారు. సమాజం అయినా, వ్యవస్థ అయినా, దేశం అయినా ప్రజారంజకంగా పురోగమించాలంటే సమర్థమైన నాయకత్వం అవసరం అనేది నిర్వివాదం. ఎన్ని వనరులున్నా, మరెంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వాటిని ప్రజావసరాలకు త్రికరణశుద్ధిగా రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న నాయకత్వం లభిస్తేనే అభ్యున్నతికి బాటలు పడతాయి. గత ఎన్నికల సమయంలో బిజెపి నేత ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయనకు, ఆయన పార్టీకి పట్టం కట్టారు. ఇక భారత్‌కు తిరుగులేని నాయకుడిగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటారని అందరూ ఊహించారు. కానీ ఎందుకో ఏమో రానురాను పరిస్థితులు అందుకు విరుద్ధంగా పయనిస్తు న్నాయేమోననిపిస్తున్నది. ఆయన ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కొ క్కటి వికటిస్తున్నాయి. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నా యి.

పెద్ద నోట్ల రద్దు, మరొకపక్క జిఎస్‌టి ప్రస్తుతం పెరుగు తున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అసలు ఈ పెద్దనోట్ల రద్దు ఎవరికి ఏమేరకు మేలు చేశాయేమోకాని సన్న,మధ్యతరగతి ప్రజలు పడిన, పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావ్ఞ. నేటికీ నగదు కొరతతో సామాన్యులు పడుతున్న ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎటియంల వద్ద నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తు న్నాయంటే అర్థం చేసుకోవచ్చు. పాలకులు ఏ కార్యక్రమం, పథకాలు, సంస్కరణలు చేపట్టినా అవి ఏమేరకు ఎంత మంది ప్రజలకు ఉపయోగపడతాయి? అమలులో ఉన్న సాధకబాధ కాలు ముందుగా అధ్యయనం చేసి అడుగు ముందుకు వేయా లి. కానీ అలాకాకుండా ఎసి రూమ్‌ల్లో కూర్చొని కొన్ని ఆలోచనలకు అనుగుణంగా ముందు వెనక పరిస్థితులు అంచనా వేయకుండా చేపడితే ఫలితాలు దారుణంగా ఉంటాయి. పెద్ద నోట్ల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు పెరిగిన, పెరుగుతు న్న పెట్రోలు, డీజిల్‌ ధరల ప్రభావం కూడా మోడీ ప్రభు త్వంపై చూపకతప్పదు. ఇదేదో ఎసి వాహనాల్లో తిరిగేవారికి మాత్రమే సంబంధించింది అనుకుంటే పొరపాటే. అసలు వాస్తవంగా ఈ ధరలు ఎంత పెరిగినా, ఉన్న డబ్బును ఎలా ఖర్చుపెట్టాలని తర్జనపడే నల్లధనస్వాములకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.బీదా బిక్కి, మధ్యతరగతి ప్రజలే ఇబ్బంది పడుతున్నా రనేది పాలకులకు తెలియనిది కాదు.

చమురు ధరల పెంపు సామాన్యుడి ఆర్థికపరిస్థితిని చావ్ఞదెబ్బ కొడుతున్నది. ఈ ధరల పెంపుతో నిత్యావసర వస్తువ్ఞలు కూడా అదుపులేకుండా పెరిగిపోయాయి. మరొకపక్క ప్రజారవాణ సంస్థల పరిస్థితి అయోమయంగా తయారవ్ఞతున్నది. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయల నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ కానీ, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థల పరిస్థితి కానీ మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలున్నాయి. ఈ లోటును తీర్చు కునేందుకు ప్రయాణ ఛార్జీలు పెంచే అవకాశం కన్పించడం లేదు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఏ ప్రభుత్వాలు ధైర్యం చేయవ్ఞ. దీంతో నష్టాలు మరింత పెంచుకోవడం తప్ప మరో మార్గం కన్పించడం లేదు. ఈ నష్టాలు పెరిగిపెరిగి చివరకు ఈ సంస్థల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందేమోననే అనుమా నాలు వ్యక్తమవ్ఞతున్నాయి. ఈ ప్రభావం పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇతర ప్రైవేటు రవాణా వ్యవస్థలపై కూడా పడతాయి. ఆ లోటును తీర్చుకునేందుకు ప్రైవేటు సంస్థలు తమ రేట్లను పెంచక తప్పదు. ఇప్పటికే బెంగళూరు, షిర్డి, ముంబాయి, తదితర దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్‌ బస్సులకు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. వ్యవసాయరంగంపై కూడా తీవ్ర ప్రభావమే చూపుతున్నది. ఒకపక్క యాంత్రీకరణకు ప్రోత్సాహం ఇస్తూ మరొకపక్క ఈరేట్లు పెంచడంతో ప్రభావం రైతులపై పడుతున్నది.

గతంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నేందుకు గంటకు ఆరు నుంచి ఏడువందల రూపాయలు తీసుకుంటుం డగా ఇప్పుడు అది ఒక్కసారి వెయ్యి రూపాయలకు పెంచారు. అయినా గిట్టుబాటు కావడం లేదని ట్రాక్టర్ల యజమానులు వాపోతున్నారు. అంత చెల్లించి సాగు చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో అనే అనుమానంలో రైతన్నలున్నారు. చాలా ప్రాంతాల్లో అటు రైతులు, ట్రాక్టర్ల ఓనర్ల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఇక కూరగాయల రైతుల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదు. ముఖ్యంగా రవాణా విషయంలో కూడా బాగా పెంచుతున్నారు. రవాణా ఖర్చులు కూడా వెళ్లడం లేదని టమోటా రైతులు వాపోతున్నారు. మరొకపక్క నిత్యా వసర వస్తువ్ఞల ధరలు అందుకోలేనంతగా పెరిగి సామాన్యులు సైతం విలవిలాడుతున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు అన్ని రంగాల్లో ప్రభావం చూపుతూ బీదాబిక్కి జీవితాన్నే కాదు సామాన్యుల జీవితాన్ని కూడా మరింత దుర్భరం చేస్తున్నాయి. ఇతర సమస్యల మాట ఎలా ఉన్నా రోజురోజుకు పెరిగిపోతూ ప్రజాజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్న నిత్యావసర వస్తువ్ఞల ధరలను అదుపులో పెట్టే ఆలోచన కానీ, ప్రయత్నం కానీ జరగకపోవడం దురదృష్టకరం. అదేమంటే డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదల సంస్కరణలు అంటున్నారు. ఏమేమో కార్యక్రమాలు ఏర్పాటు చేసి వందలాది కోట్ల రూపా యల ప్రజాధనంతో ఊదరగొడుతున్నారు.

చేసిన కార్యక్రమా లను కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రచారం చేసుకుంటు న్నారు. కానీ పూటగడవని సామాన్యుడిని ఆదుకోవడం కోసం సమగ్రమైన కార్యక్రమం చేపట్టలేకపోతున్నారు. కాగితాలపై చేపట్టినా ఆచరణకు వచ్చేసరికి పదోవంతు కూడా వారికి అందడం లేదు. ఒకపక్క నిరుపేదలకు కూడా గ్యాస్‌ అందిం చాలని ఎంతో కొంత సబ్సిడీ ఇస్తూ మరొకపక్క మధ్యతరగతి వారికి అందకుండా పెంచుకుంటూ పోతున్నారు. 1980లో గ్యాస్‌ ధర యాభైఆరు రూపాయలు ఉంటే 1986 నాటికి ఆరేళ్లలో ఆరు రూపాయలు మాత్రమే పెరిగింది. కానీ ఆ తర్వాత పెంపునకు అదుపులేకుండాపోయింది. ప్రస్తుతం ఐదువందల యాభైకు చేరుకుంది. ఇక కిరోసిన్‌ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు అందాల్సిన కిరోసిన్‌ ఎలా పెట్రోల్‌లో చేరుకుంటుందో తెలి యంది కాదు. కిరోసిన్‌ ధర కూడా సామాన్యులు అందుకో నంతగా పెంచేశారు. రాష్ట్రాలకు వస్తున్న కిరోసిన్‌లోఅధికశాతం నల్లబజారులకే తరలిపోతున్నది. ఒకపక్క గ్రామాల్లో సైతం కట్టెల పొయ్యిని మరిచిపోతున్నారు. రానురాను కట్టెలుదొరకడం కష్టమైపోతున్నది. మరోపక్క కిరోసిన్‌, గ్యాస్‌ అందుబాటులో లేకుండా పోతున్నది. ఇక కాళ్లు, చేతులు పొయ్యిలో పెట్టి వండాల్సిందేనని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలపరిస్థితులకు అనుగుణంగా మనుషుల అలవాట్లు మారిపోయాయి.

ఇంకా మారుతూనే ఉన్నాయి. ఒకటి రెండు రోజులు భోజనం లేకుండా అయినా ఉండగలుగుతారేమో కానీ కాఫీ, టీ లేకుండా ఉండలేని పరిస్థితుల్లో సామాన్యులు సైతం ఇరుక్కుపోయారు. పప్పుబెల్లాలే కాదు, ఉప్పు,మిరపకాయలు కూడా ఇప్పటికే భగ్గునమండిపోతున్నాయి.చింతపండు కిలో రెండువందల రూపాయలకు దాటింది. ఇదీ అదీ తేడాలేకుండా అన్ని వస్తువ్ఞల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత నెలలో ఉన్న ధర ఈ నెలలో ఉండటం లేదు. ఇప్పుడు ఉన్న ధర వచ్చే నెలలో ఉండదు. ఇలా ధరలన్నీ ఇష్టానుసారంగా పెంచుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పెట్రోలు, డీజిల్‌ ధరలను మళ్లీ పెంచారు. కానీ రైతుల వద్ద ఉన్నప్పుడు ఈ సరుకుల ధర కొంత అదుపులో ఉంటుంది. బియ్యం తీసుకున్నా, పప్పుల విషయం తీసుకున్నా ఇది స్పష్టమవ్ఞతుంది. ఉత్పత్తిదారుడి వద్ద నుంచి వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి రెట్టింపు అయిపోతున్నాయి. పోనీ వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారంటే అదీ లేదు. ముందువెనక రాజకీయ అండ ఉన్నవారు తప్ప వ్యాపారులు కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్పత్తిదారు డికి, వినియోగదారుడికి మధ్య ఉన్న వ్యత్యాసంలో నిత్యావసర వస్తువ్ఞ ఏది తీసుకున్నా ఏడాదిగా పరిశీలిస్తే కొన్ని వందల కోట్ల రూపాయల తేడా వస్తుంది. ఇదంతా ఎటుపోతున్నది. ఎవరు భోంచేస్తున్నారు. తదితర అంశాలన్నీ పాలకులకు తెలియందికాదు. అయినా కట్టడి చేయరు. నియంత్రించరు. కానీ మధ్యదళారులు, నల్లబజారు వ్యాపారస్తులు అక్రమాలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తారు. అప్పుడప్పుడు నామమాత్రంగా కేసులు పెట్టిస్తున్నారు. జైలు శిక్ష అనుభవించి వచ్చినవారు సైతం మళ్లీ అదే నల్లబజారు వ్యాపారంలో మునిగి తేలుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఊదురుగొట్టం వాడు ఊదుతుంటే చల్లార్పుడు గొట్టడం వాడు చల్లార్పుతున్నట్లుగా ఉంది పాలకులు, నల్లబజారు వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరు. అందుకే ఆనాడు నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో అభినందించినవారే నేడు పెదవి విరుస్తున్నారనే వాస్తవాన్ని ఎంత తొందరగా కేంద్ర పాలక పెద్దలు గ్రహిస్తే వారికి అంత మంచిది.

– దామెర్ల సాయిబాబా