పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదే

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్

Former MLA Dhulipalla Narendra Kumar

అమరావతి: నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు, అధర్మం గెలిస్తే, ధర్మం ఓడిందని, అభూత కల్ప నలు, అసత్యాలతో ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసి పాలకులు తాము అనుకున్న రాజకీయ కక్షను సాధించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలుగుజాతి ఔన్నత్యంకోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు. తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని పనిచేసిన, చేస్తున్న చంద్రబాబునాయుడు ఎప్పటికైనా విజయం సాధిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే భవిష్యత్ లో రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. యువనాయకుడు నారా లోకేశ్ నేత్రత్వంలో న్యాయపోరాటం చేసి, ధర్మాన్ని గెలిపిద్దామని, అంతవరకు టీడీపీ కార్యకర్తలు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ వసూల్ రాజా సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు రిమాండ్ పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. కేసుల్ని ఎదుర్కొనే క్రమంలో జగన్ రెడ్డి రొమ్ము విరిచి నిలబడ్డాడని సజ్జల చెప్పడం సిగ్గుచేటు. కోడికత్తి కేసువిచారణలో జగన్ రెడ్డి ఎందుకు రొమ్ము విరిచి నిలబడలేదో సజ్జల చెప్పాలన్నారు. . చాలా స్పష్టంగా ఎన్.ఐ.ఏ కోడికత్తి కేసులో ఎలాంటి కుట్రలేదని చెప్పిందని . కేవలం అధికారంకోసమే జగన్ రెడ్డి ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడి రాజకీయ లబ్ధి పొందాడని సుస్పష్టంగా తేలి పోయిందన్నారు. చేయని నేరానికి అమాయకుడైన దళితబిడ్డ జైల్లో మగ్గిపోతుంటే, జగన్ రెడ్డి మాత్రం హాయిగా బయట తిరుగుతున్నారని అన్నారు. తనపై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల విచారణకు హాజరుకాకుండా, రకరకాల కారణాలతో పిటిషన్లు వేస్తూ జగన్ రెడ్డి ఎందుకు తప్పించుకుంటున్నాడో, ఎందుకు రొమ్ము విరిచి నిలబడలేదో సజ్జల చెప్పాలన్నారు. సొంత బాబాయ్ హత్యకేసు విచారణను జగన్ రెడ్డి ఎందుకు రొమ్ము విరిచి ఎదుర్కోవడంలేదని , అధికారంలో ఉండి కూడా ఎందుకు హత్యచేసిన వారిని శిక్షించలేకపోయారో సజ్జల చెప్పాలన్నారు.
ప్రభుత్వ కుట్ర, పాలకుల దుర్మార్గానికి చంద్రబాబునాయుడు లాంటి నాయకుడు బలికావడం నిజంగా బాధాకరమని, జరిగిన దారుణం ప్రతి టీడీపీ కుటుంబానికి తీరని వేదన, బాధ మిగిలించాయన్నారు. యువనాయకుడు లోకేశ్ నేతృత్వంలో మనందరం రెట్టింపు ధైర్యంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.” అని నరేంద్ర సూచించారు.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/category/news/international-news/