పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

Danam Nagender
Danam Nagender

హైదరాబాద్: ప్రగతి నివేదన సభను కనీవినీ ఎరుగని రీతిలో జ‌య‌ప్ర‌దం చేస్తామని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొంటారని అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన దానం.. హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో జనసమీకరణ చేపడతామన్నారు. తన తరఫున 50వేల నుంచి లక్ష వరకు కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. అపార అనుభవం కలిగిన సీఎం కేసీఆర్.. ప్రణాళిక ప్రకారం ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం.. రైతు బంధు పథకం, రైతు బీమా పథకం ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు.