పార్లమెంట్‌ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు

RAJATH KUMAR
RAJATH KUMAR

కేంద్ర చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ ఆరోరా సమీక్ష
కొత్తగా ఓటు నమోదు కోసం 27 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ కోసం మరింత పకడ్బందీగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చే స్తుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకంటే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల ఏర్పాట్లపై రెండు,మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ సునీల్‌ ఆరోరా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన సమీక్షించారు.ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి,డిజిపి మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రంలో చేస్తున్న ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి µకారి రజత్‌కుమార్‌ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరించారు.ఓటర్ల జాబితా,శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికల నిర్వహణకు అందు బాటులో ఉన్న సిబ్బంది, ఇవిఎంలు, వివిప్యాట్ల అంశంపై ఆయన చర్చించారు.త్వరలో కమిషన్‌ పూర్తి సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ పర్యటించనుందని రజత్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే చిన్నదని,ఇక్కడ 17 లోక్‌సభ సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.’డిఈఓలకు,ఆర్వోలకు మీటింగ్‌ ఏర్పాటు చేశాం. అనంతరం ఎగ్జామ్‌ కూడా పెట్టాం,అయితే ఎగ్జామ్‌లో పాస్‌ అయితేనే వాళ్లు ఆర్వోలుగా అర్హులు,లేదంటే ఢిల్లీలో 20,21 తేదీల్లో మళ్లీ ఎగ్జామ్‌ ఉంటుంది.రాష్ట్రంలో శాంతిభద్రతలపై కూడా చర్చించాం.గడిచిన అసెంబ్లీ ఎన్నికలను బాగా నిర్వ హించారని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అభినందించారు.ఈసారి ఫస్ట్‌ టైమ్‌ యంగ్‌ ఓటర్ల నమోదు కోసం ఎక్కువ దృష్టి పెట్టాం. మంచి రెస్పాండ్‌ వచ్చింది.కొత్తగా ఓటు నమోదు కోసం మొత్తం 27.31లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటికే 10 లక్షల అప్లి కేషన్లు క్లీయర్‌ చేశారు. ఏడు లక్షలకు పైగా మొదటిసారి ఓటు హక్కు పొందారు. మరో నాలుగైదు లక్షల వరకు ఓటు హక్కు పొందే అవకాశం ఉంది. ఈనెల 22న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తాం. ఇది మంచి పరిణామం అని చెప్పారు.
‘సీనియర్‌ అధికారులకు సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ సమావేశంలో ఎలక్ట్రోల్‌, ఇవిఎంలు ఎన్నికల ఖర్చుపై చర్చించాం. ఇతర రాష్ట్రాల నుంచి మాస్టర్‌ ట్రైనర్లు ఉన్నారని వీరు ఎన్నికల ఖర్చు నామినేషన్లు ఎలా ఫీల్‌ చెయ్యాలి,. వికలాంగులుగా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి. ఓటర్లకు సంబంధించిన అన్నింటిపై అవగాహన కల్పి ంచారు. న్యాయ వ్యవస్థపై కూడా చర్చిస్తారు. ఆర్వోలు,డిఇఓల పోస్ట్‌లు కొన్ని ఖాళీ ఉన్నాయి. వాటిని త్వరలో భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే సిఎస్‌తో చర్చించాం. వారు కూడా చెప్పారు. సుప్రీంకోర్టు,హైకోర్టుకు లోబడి ముందుకు పోతాం. అన్ని టెక్నిక్‌ విష యాలపై సీనియర్‌ అధికారులకు అవగాహన ఉండాలి. ఈరోజు ఎన్నికల్లో డీఈఓ,ఆర్వోల బాధ్యతపై సమా వేశంలో అవ గాహన కల్పించారు. జిల్లా కలెక్టర్‌లు సీనియర్‌ అందురూ ఇందులో పాల్గొన్నారు. తర్వాత ఈవిఎం, వివిప్యాట్‌, పెయిడ్‌ న్యూస్‌, ఫేక్‌ న్యూస్‌ ఎంసి. కౌంటింగ్‌ చర్చిస్తాం. కౌంటింగ్‌పై మీడియాకు ఒక్కరోజు అవగాహన కార్యక్రమం పెడతాం. సాంకేతిక పరిజ్ఞానం కూడా మరింత అప్‌గ్రేడ్‌ చేస్తాం. మొన్న ఎన్నికల్లో కంటే వచ్చే ఎన్నికల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తాం. మనదగ్గర మొన్న సి విజిల్‌,1950 కాల్‌ సెంటర్‌ కూడా ఉపయోగించాం. ఆర్వోలను కొంత మంది మార్పులు చేసే అవకాశం ఉంది. ఆర్వోలు చాటా కష్టపడి పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో మన రాష్ట్రం చిన్న రాష్ట్రం ఇక్కడ 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గడిచిన ఎన్నికల సమయంలో మొత్తం అన్ని స్థాయిల్లో 2లక్షల 50వేల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ శిక్షణ ఇచ్చాము,ఇక్కడ జాతీయ స్థాయిలో మాస్టర్‌ ట్రైనర్లు వచ్చి డీఈఓలకు ఇస్తున్నారు వీరు, తర్వాత వారి జిల్లాలో శిక్షణ ఇవ్వాలి.గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా రిపోలింగ్‌ రాలేదు అలా ఎన్నికలు నిర్వహించాం. తక్కువ సమయంలో ఎన్నికలు వచ్చాయి.అసెంబ్లీ ఎన్నికల్లో కింది స్థాయిలో 35వేల మంది సిబ్బంది ప్రిసైడింగ్‌ అధికారులు పాల్గొన్నారు. అందులో 150 నుంచి 200 మంది సిబ్బంది ఇబ్బంది పడ్డారు. మానవ తప్పిదం వల్ల ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉండకూడదు, ఇవిఎంపై డౌట్‌ ఇంటు వివిప్యాట్‌ను లెక్కించవచ్చు అని చెప్పారు.
అవగాహన లేకనే వికారాబాద్‌ కలెక్టర్‌ ఈవీఎంలను తెరిచారు:
అవగాహన లేక వికారాబాద్‌ కలెక్టర్‌ ఈవీఎంలను తెరిచారని, అది నిబంధనలకు విరుద్దమని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నదని వెల్లడించారు. ‘సాధారణ బదిలీలతో మాకు సంబంధం లేదు. మూడేళ్లు పూర్తయి ఎన్నికల విధులు నిర్వహించే వారిని బదిలీ చేయాలి… కొన్ని చోట్ల రిటర్నింగ్‌ అధికారులను మార్చాలన్న విజ్ఞప్తులు వచ్చాయి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.