పార్లమెంటు మూసేసారు..సుప్రీంను తొక్కేసారు

Rahul
Rahul

న్యూఢిల్లీ: దేశంలో దళితులు, మైనార్టీల హక్కులు అణిచివేస్తున్నారని, ప్రధానినరేంద్రమోడీ హయాంలో దేశవ్యాప్తంగా బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, దళితులు, మైనార్టీలు అణిచివేతకు గురవుతున్నారని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ తీరువల్ల నేడు దేశం అతలాకుతలం అవుతున్నదని పేర్కొన్నారు. ప్రధానికి మళ్లీ ప్రధానిపదవిని అధిష్టించాలన్న తపనమాత్రమే ఎక్కువ ఉందని, దేశ ప్రజల శ్రేయస్సుభద్రత అవసరం లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించండి అన్న నినాదంతో ప్రత్యేక కార్యాచరణనుప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీ సదస్సులో రాహుల్‌ మాట్లాడుతూ దళితుల హక్కులు, మహిళల భద్రత ఈరెండూ దేశవ్యాప్తంంగా సజీవసమాధి చేసారని ఆరోపించారు. రాజ్యాంగ విలువలకుసైతం ప్రమాదకరపరిస్థితులు ఎదురయ్యాయని మోడీ ప్రభుత్వంలో అణగారినవర్గాలపైనే ఎక్కువ అత్యాచారాలు,దాడులు జరుగుతున్నాయన్నారు. మోడీప్రభుత్వంలో సుప్రీంకోర్టును సైతం అణిచివేస్తున్నారని పార్లమెంటును మూసివేసారని రాహుల్‌ ఆరోపించారు. వివిధ సమస్యలపై 15నిమిషాలపాటు తనను అనుమతిస్తే నీరవ్‌మోడీ కుంభకోణమే ప్రధానంగా కనిపిస్తుందని, రాఫెల్‌ డీల్‌లో ఎంతమొత్తం భారీ అవినీతి జరిగిందో దేశప్రజలందరికీ తెలుసని అన్నారు. నీరవ్‌మోడీని ఆయన స్నేహితులు రక్షిస్తున్నారని అందరికీ తెలుసునని దేశచరిత్రలో మొదటిసారి ఒకప్రధాని మహిళలు, చిన్నపిల్లల రక్షణకు అయితేమోడీ వీటినిప్రస్తావిస్తే పరారవుతున్నారని ఆరోపించారు.ు.ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలతో పనిచేసినవారి హయాంలోప్రభుత్వం నడుస్తోందని,ప్రభుత్వ సంస్థలుసైతం ఆర్‌ఎస్‌ఎస్‌ప్రభావం ఎదుర్కొంటున్నాయని అన్నారు. దళితులు పట్టిన పారిశుధ్యపనుల్లో పవిత్రతను మాత్రమే చూస్తున్నట్లు ప్రధానిచేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్‌ ఉదహరించారు. దళితుల అభ్యున్నతికి కృషిచేయాల్సిందిపోయికొన్నింటికి మాత్రమే వారిని పరిమితంచేయడం దళితులు,అణగారిన వర్గాలపై ప్రధానికున్న శ్రద్ధ అవగతం అవుతుందని అన్నారు. బలహీనవర్గాలకు చెందిన మహిళలకు మోడీ హృదయంలో స్థానం లేదని రాహుల్‌విమర్శలు సంధించారు. ఉపాధి, ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలపై రాహుల్‌ ఎద్దేవాచేసారు. గడచిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీజీ ఇచ్చిన హామీలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఇక రానున్న ఎన్నికల కోసం కొత్త హామీలు పుట్టుకువస్తున్నాయని ఎద్దేవాచేసారు. మోడీ అంతకుముందు బేటీ బచావో, బేటీ పడావో నినాదం ఇచ్చారని, ఇపుడు ఆ నినాదాలు కాస్తా దేశవ్యాప్తంగా బేటీ బచావో బాలికలను రక్షించండి అన్న నినాదంగా మారిపోయాయన్నారు. సాక్షాత్తూ బిజెపి శానసభ్యుడే సాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారంచేసారని అన్నారు. ఉనవ్‌ఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొన్నారు. దేశంలో ఇపుడున్నపరిస్థితులను అధిగమించగలిగే సత్తా ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశం మన్‌కీబాత్‌ ఏమిటన్నది తెలుస్తుందని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రధాన మంత్రినెలవారీగా నిర్వహిస్తున్న మన్‌కీబాత్‌ను పరిగణనలోనికి తీసుకునే రాహుల్‌ పైవిధంగా వ్యాఖ్యానించారు. మోడీజికి దేశంలో మహిళలు, దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలశ్రేయస్సు ముఖ్యం కాదని,కేవలం మోడీజీలవంటి వారిపైన మాత్రమే ఆయనకు శ్రద్ధ ఉంటుందని పరోక్షంగా నీరవ్‌మోడీని ప్రస్తావిస్తూ రాహుల్‌ ఎద్దేవాచేసారు. అంతర్జాతీయ చిత్రపటంలో మోడీ భారత్‌పేరుకు మచ్చతెచ్చారని, దిగజార్చారని రాహుల్‌ ఆరోపించారు. కేవలంమోడీజీలపైనే నరేంద్రమోడీకి ప్రేమ ఉంటుందని, దేశంలో దళితులు, మహిళలపై దాడులు ఆయనకు పట్టవని అన్నారు. గత ఎన్నికలసందర్భంగా మోడీ 15 లక్షల డిపాజిట్లు, రెండుకోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చారని అవన్నీ వట్టిమాటలేననితేలిపోయిందన్నారు.