పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి సహా పార్టీ నేతలు ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పక తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నాయకులను కలిసినట్లు మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవమా? కాదా? అని రేవంత్‌ను వివ రణ అడిగినట్లు ఆయన చెప్పారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారనున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడి హోదాలో తాను వివరణ కోరనట్లు తెలిపారు. అయితే అయన నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని రమణ తెలిపారు.
ఒకవేళ తాను క కాంగ్రెస్ నాయకులను కలవలేదని..జరుగుతున్న ప్రచారంపై వారిపై పరువు నష్టం కేసులు వేయాలని తాము చెప్పామని దానికి కూడా ఇంతవరకు రేవంత్ సమాధానం చెప్పలేదన్నారు. మంగళవారం ఎన్టీఆర్భవన్లో పత్రికా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అందులో ప్రధానంగా పార్టీలో జరుగు తున్న పరిణామాలను ఎప్పటికప్పుడు టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తున్నట్లు రమణ చెప్పారు. ఈనెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున టిడిఎల్పి నిర్వహించే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 2015లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్రెడిద్డ ఎదగడానికి తాను ఎంతో కృషి చేసినట్లురమణ తలెఇపారు. కానీ..పార్టీని దాటి వ్యక్తిగతంగా బలోపేతం కావాలని ఆయన భావించినట్లు ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల అంశాన్ని చంద్రబాబునాయుడు చూసుకుంటారని, ఎవరు దీని పై మాట్లాడాలో అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలుఉన్నాయన్నారు.