పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తే అదనపు శక్తి

PAWAN, NADENDLA
PAWAN, NADENDLA

పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తే అదనపు శక్తి

గుంటూరు(అమరావతి):  బలమైన వ్యక్తిత్వం, చిత్తశుద్ధి, అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్‌ జనసేనలో చేరటంతో పార్టీ సిద్ధాంతాలను ,పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లే అదనపు శక్తి వస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు.. తనకు మనోహర్‌ అన్నయ్యలాంటివాడని, ఆయన అనుభవంతో ఎంతోకలిసివస్తుందన్నారు.. నాదెండ్లకు హృదయపూర్వకంగా జనసేన కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో శాసన సభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా ఆయన్ని పార్టీ అధినేత పూల మాలతో సత్కరించి ఆహ్వా నించారు. పవన్‌ మాట్లా డుతూ, మనోహర్‌ చిత్తశుద్ధితోకూడిన ఆలోచన ఉన్నవారని, ఎప్పటినుంచో తనతోపరిచయం ఉందన్నారు.. నాలుగు సంవత్సరాలుగా నేను ఎక్కడ ఏమి మాట్లాడినా.. వాటిని చూసి ఏది తప్పు, ఏది ఒప్పు అనిచెప్పేవారన్నారు.. భాజపా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి అనితాను డిమాండ్‌ చేయటం వెనుక మనోహర్‌ నేను చర్చించిన సందర్భం. అపుడు తెలిసిన విషయాలు ఉన్నాయన్నారు.

పార్టీలో చేరమని గతంలో ఒకసారి కోరాను మినహా ఒత్తిడి తేలేదన్నారు.. సమాజంలో బలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ఎలా ముందుకు వెళ్లాలి.. నవశకం రాజకీయాలు ఎలా ఉండాలి.. విలువలతోకూడిన రాజకీయం ఏ విధంగా నడపాలి లాంటి విషయాలపై చర్చించుకున్నామని, రాష్ట్రంలోఉన్న సమస్యలపై మాట్లాడుకున్నామని తెలిపారు. క్లిష్టసమయంలో సభాపతిగా పనిచేసన అనుభవశాలి మనోహర్‌ పార్టీతోకలిసి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు.

పవన్‌కు వెన్నంటి ఉండాలి: నాదెండ్ల మనోహర్‌ ్ద్ఠనాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ, పవన్‌ ఆలోచనా విధానం, సమాజానికి మంచి చేయాలి అనే తపన తనకు తెలుసునని, భగవత్సంకల్పంతోనే జనసేనకురావటం జరిగిందన్నారు. ఈ పార్టీలో చేరికకు ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు లభించా యన్నారు.. ఇవాల్టి నుంచి జనసేనకుడినని, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని అన్నారు. అయితే ఎప్పుడూ మనం కమిట్‌మెంట్‌తో పనిచేసి జనానికి దగ్గరగా ఉండాలన్నారు. సదాశయంతో పార్టీని నడిపిస్తున్న పవన్‌ వెంట మనం ఉండాలన్నారు. ఆయన ఆలోచనా విధానాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి నిత్యం తీసుకెళ్లాలన్నారు. జనసేనికుల్లో మంచి క్రమశిక్షణ కన్పిస్తోందన్నారు. ప్రజల సమస్యలపై పోరాడితేఆ కార్యక్రమాలే మనల్ని ఎన్నికల్లో ప్రజల ముందు ఉంచుతాయన్నారు..