పార్కింగ్‌లో ఉన్న 175 కార్లు దగ్ధం

massive fire
massive fire


చెన్నై: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎయిర్‌షోలో జరిగిన ఘోరఅగ్నిప్రమాదం సంఘటన మరువకముందే చెన్నైలో కూడా ఇదే సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు అగ్నిప్రమాదంలో సుమారు 300కిపైగా కార్లు దగ్ధం అయితే చెన్నై పార్కింగ్‌ ప్రాంతంలోనూ సుమారు 175 కార్లకుపైగా దగ్ధం అయ్యాయి. అక్కడే ఉన్న ఓ ప్రైవేటు పార్కింగ్‌ప్రాంతంలో హటాత్తుగా మంటలు చెలరేగి అన్ని కార్లకు వ్యాపించాయి. అగ్నిపమాపక దళాలు వచ్చి మంటలను అదుపులోనికి తెచ్చాయి. పోరూరులోని రామచంద్ర ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన కార్లను పార్కింగ్‌ చేసే ప్రాంతంలో ఈదుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న రసాయన వ్యర్ధాల డంపింగ్‌ యార్డులో మంటలు అంటుకుని ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ మంటలు కార్ల పార్కింగ్‌ ప్రాంతంవరకూ వ్యాపించాయి. డంపింగ్‌ యార్డులో చెరకు పిప్పి ఉండటంతోమంటలు వేగంగా వ్యాపించాయి.