పారిశ్రామిక‌రంగ వార్షిక నివేదిక విడుద‌ల‌

TS Minister Ktr
TS Minister Ktr

హైద‌రాబాద్ః తెలంగాణ పారిశ్రామికరంగ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం విడుదల చేశారు. 2017-18లో తెలంగాణ పారిశ్రామిక వృద్ధి 10.4 శాతం పెరిగిందన్నారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా రూ.లక్షా 23 వేల 478 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వీటితో 5.27 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తొలిస్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.