పాము కాటుకు విరుగుడు

snake speer
wash

పాము కాటుకు విరుగుడు

పాము కాటువేసిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్‌కు వెళ్లేదాకా రోగికి ప్రాణాపాయం తప్పుతుంది. పాము కాటు వేసిన చోట గంటు పెట్టి రక్తమును పిండివేయాలి. దానిపైన చుట్టతో కానీ గుడ్డ చుట్ట తదితర సాధనములతో కానీ కాల్చాలి. ఇలా చేయడం వల్ల రక్తములో విషము బయటకు వస్తుంది. కాటు వేసిన చోట విషం ఉన్నట్లయితే కాల్చినచో విషం హరిస్తుంది. ఛాయ పసుపును నీటిలో కలిపి తక్షణమే త్రాగించాలి.

గరికి వేళ్ళ రసమును లోనికి పట్టించాలి. పాము కాటు విషమునకు పసుపునకు మించింది లేదు. దీనిని పైకి రాసినను, లోపలికి ఇచ్చినను పసుపు నీటితో స్నానము చేయించినా మంచిదే. భోజనములో పసుపును వాడాలి. దాహమునకు గాను పసుపు నీటినే తాగించాలి. ఇట్లు చేసినా పాము విషము హరిస్తుంది. పాము విష మునకు పసుపును మించిది లేదు.