పామాయిల్‌ దిగుమతులపై సుంకాలపెంపు

VEG-OILS copy
veg oils

అహ్మదాబాద్‌: కేంద్ర ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిదారుల దిగుబడులను రక్షించేందుకు దేశీయంగా ఉత్పత్తులకు మార్కెట్‌కల్పించేందుకుగాను ముడి వంటనూనెల దిగుమతులపై సుంకం పెంచింది. దీనివల్ల ఆయిల్‌సీడ్‌ రైతులకు మేలుజరుగుతుందని ఆర్ధికశాఖ వెల్లడించింది. శుద్ధిచేసిన, ముడి పామాయిల్‌లపై గరిష్టంగా సుంకం పెంచింది. ప్రస్తుతం ఉన్న 30శాతం నుంచి 44శాతానికి సుంకం పెంచిందని రెవెన్యూ డిపార్టుమెంట్‌ప్రకటించింది. అలాగే రిఫైండ్‌, బ్లీచ్డ్‌ డియోడరైజ్డ్‌ పామోలిన్‌ను 40శాతంనుంచి 54శాతానికి పెంచినట్లు ప్రకటించింది. ఈనెల ఒకటవ తేదీనుంచే పెంచిన సుంకం రేట్లు అమలులోనికి వస్తాయి. సుంకం పెంపుటో దేశీయసాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఇఎ) హర్షం ప్రకటించింది. దేశం మొత్తంమీద 70శాతం వినియోగంలో దిగుమతులపైనే ఆధారపడటం వల్ల దేశీయ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు నష్టం వాటిల్లుతోందని, గడచిన కొంతకాలంనుంచి కేంద్ర ప్రభుత్వాన్ని సుంకాలు పెంచాల్సిందిగా కోరుతున్నట్లు వివరించారు. తమ విజ్ఞప్తులకు నేడు ఆకర్యరూపంలో కేంద్రం సుంకాల పెంపును ప్రకటించిందన్నారు. అయితే కొంతమేర అసంతృప్తినిసైతం వ్యక్తంచేసింది. దేశీయ ఉత్పత్తులపై సుంకాలను కూడా పెంచడం వల్ల 2022 నాటికి రైతు రాబడులు రెట్టింపు కావాలన లక్ష్యానికి తూట్లు పడుతుందని వెల్లడించింది. సంఘం అధ్యక్షుడు అతుల్‌ చతుర్వేది మాట్లాడుతూ ఈ విధానం నూనెగింజల రైతులనను అసంతృప్తికి గురిచేసిందన్నారు. మన రైతులకు సోయాగింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వివిధ చమురుగింజలపై పామాయిల్‌తరహాలోనే దిగుమతుల సుంకాలు పెరగలేదని దీనివల్ల నూనెగింజల రైతుల్లోనే వివక్ష ఏర్పడుతుందని ఆయన అన్నారు. నూనెగింజల ఉత్పత్తిచేసే రైతులందరికి ఆమోదయోగ్యంగా ఉండేందుకుగాను మొత్తం అన్నింటిపైనా సుంకాలు పెంచాలని కోరారు. సిపిఒ పామోలిన్‌కు మధ్య కనీసం 15శాతం తేడా ఉండాలని, ప్రస్తుతం పదిశాతం మాత్రమే ఉందని సంఘ అధ్యక్షుడు వెల్లడించారు. భారత్‌కు వంటనూనెల దిగుమతులు నవంబరునెలనుంచి జనవరి వరకూ 3628.734 టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 3,414,008 టన్నులతో పోలిస్తే ఆరుశాతం వార్షిక పద్దతిలో వృద్ధిచెందుతున్నట్లు వెల్లడి అయింది.