పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ ఫైనల్లో సానియా జోడీ

SANIAFFF
Sania Pair Enters Finals in Pan Pasific Open Tourney

పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ ఫైనల్లో సానియా జోడీ

టోక్యో: టొరెపాన్‌ పసిపిక్‌ ఓపెన్‌ టోర్నీలో సానియా మీర్జా జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.కాగా మహి ళలడబుల్స్‌ సెమీ ఫైనల్లో రెండవ సీడ్‌ సానియా-బార్బారా స్ట్కైకోవా(చెక్‌ రిపబ్లిక్‌) జోడీ 4-6,6-3,10-5తో గాబ్రియల్‌ డబ్రోస్కి(కెనడా)-మరియా మార్టినెజ్‌ (స్పానిష్‌) జోడీని ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో సానియా జోడీ మియూ కాటో(జపాన్‌-ఇపాన్‌ జూ (చైనా) జోడీపై 6-2,6-2తో గెలిచింది. జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన పోరు జపాన్‌ ఓపెన్‌లో శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ నుంచి వెనుదిరిగాడు. జర్మనీ ఆటగాడు మా ర్క్‌, జ్యూబ్లెర్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21-18, 14-21, 19-21తో పరాజ య మ్యాడు. దీంతో జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత్‌ పోరు ముగి సింది. కాగా 8వ సీడ్‌ శ్రీకాంత్‌ 15వ ర్యాంక్‌ ఆటగాడు మార్క్‌ మధ్య జరిగిన క్వార్టర్‌ పోరు హోరా హోరీగా సా గింది. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీకాం త్‌కు మెరుగైన రికార్డు ఉంది. కాగా మొదటి సెట్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌ రెండవ సెట్లో ఘోరంగా విఫలమయ్యాడు.నిర్ణయాత్మక మూడవ సెట్‌ హోరీహోరీగా సాగింది.మొదట్లో శ్రీకాంత్‌ ఆధిక్యంలో దూసుకుపోయినా 16 పాయింట్ల వద్ద ఇద్దరి స్కోరు సమమైంది.అక్కడి నుంచి మార్క్‌ 18-16,20-16తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ సమయంలో శ్రీకాంత్‌ కొంత పోరాడినా 19-21తో మార్క్‌ విజయం సాధించాడు.