పానీయాలతో దంతక్షయం

పానీయాలతో దంతక్షయం
ఆమ్ల స్వభావం కల్గిన ఆహార పదార్థాలు, పళ్ళ రసాలు కూడా పళ్ళకు కొద్దిగా హాని కల్గిస్తాయి. సోడా గ్యాస్ కలిగిన ద్రవాలు, కూల్‌డ్రింక్స్ పళ్ళకు హానిచేస్తాయి. ఆమ్ల స్వభావం కల్గిన ద్రవాలు ఆహార పదార్థాలు ఒక్కసారి భోజన సమయంలో మాత్రం తీసుకోవచ్చు.ఆమ్లపూరిత ఆహార పదార్థాలు తిన్నా త్రాగినా పంటిపై వాటి ప్రభావం ఉండి పళ్ళు గారపట్టడం జరుగుతుంది. ఇది దంతక్షయానికి, పంటి మద పింగాణిపొర పాడవడానికి కారణం అవుతుంది. చక్కెర లేని చూయింగ్ గమ్స్ 20 నిముషాల పాటు నమలడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. చూయింగ్‌గమ్స్ నములుతున్నప్పుడు లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఆమ్ల ప్రభావం తగ్గి పింగాణి పొరఖనిజ లవణాలను కాపాడుకుని దంతక్షయం రాకుండా నివారిస్తుంది. చాలామంది స్పోర్ట్స్డ్రింక్స్ గురించి అడుగుతుంటారు.
ఇవి ఆమ్లత్వాన్ని కల్గి దంతక్షయానికి కారణం అవుతాయి. అయితే ఆటగాళ్ళు శిక్షణ సమయంలో ఎక్కువ ద్రవాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఇది వారికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. ఇలాంటి సమయాల్లో మంచినీరు లేదా చక్కెర లేని ద్రవాలు తీసుకోవడం మంచింది. డ్రింక్స్ త్రాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం దంతక్షయన్ని నివారించడంలో సహాయపడుతుంది.
ఈ విధానం వల్ల డ్రింక్ నోటి వెనుక భాగానికి తిన్నగా చేరడం వల్ల పంటితో ఎక్కువ సంబంధం కల్గి ఉండదు. ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్‌తో రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడం వల్ల దంతక్షయం రాదు. అలాగే అన్నిరకాల ఆల్కహాల్ డ్రింక్స్ దంతక్షయానికి కారణమవ్ఞతాయ. ఎందుకంటే వాటిలో ఎక్కువగా పుల్లని పళ్ళరసాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆల్కహాలు తీసుకోకపోవడం మంచిది. దంతక్షయం నివారణకు ప్రత్యేక చికిత్స అవసరం ఉండదు. తరచుగా దంతవైద్యడ్ని సంపద్రించి నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దంతక్షయం రాకుండా నివారించవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫిల్లింగ్ చికిత్సద్వారా అరిగిన పళ్ళకు చికిత్స చేస్తారు.