పాద‌యాత్ర ప్ర‌జ‌ల క‌ష్టాల్ని తెలియ‌జేసిందిః జ‌గ‌న్

Y S Jagan
Y S Jagan

అనంతపురం: ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ ‘‘నా పాదయాత్ర విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్ర అనేది ప్రత్యేక అనుభూతి. ఇంతకుముందు కూడా ప్రజా సమస్యలు తెలియని వ్యక్తిని కాదు. ఓదార్పు యాత్ర కూడా గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంతో జనాల్లోకి బాగా చొచ్చుకొని వెళ్లాం. ప్రజల కష్టాలను తెలుసుకోగలిగాం. ఎవరూ వెళ్లని పూరి గుడిసెల వద్దకు కూడా నా ఓదార్పు యాత్ర తీసుకువెళ్లింది. పాదయాత్రలో వృద్ధులు కనిపిస్తే మాట్లాడా. ఓదార్పు యాత్ర ప్రజల కష్టాల్ని తెలియజేసింది. పాదయాత్రతో మరో అడుగు ముందుకు వేశాం. ఓదార్పు కంటే పాదయాత్ర చాలా ఇంటెన్స్. పాదయాత్రలో ఎవరైనా నన్ను కలవొచ్చు. నేను కలవొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆర్జీ ఇవ్వడం జరిగింది. ప్రతీవర్గం వాళ్లవాళ్ల సమస్యను నాకు వివరించారు’’ జ‌గ‌న్ తెలిపారు.