పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న సాండిచ్చేరి సీఎం

Narayana swamy
Narayana swamy

పోలవరం ప్రాజెక్టు సాధనకు ఏపీ కాంగ్రెస్‌ నేతలు మహాపాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌ చేపట్టిన ఈ పాదయాత్రను పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి రేపు ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర ఈ నెల 10వ తేదీన ముగియనుంది. కాగా, అదే రోజున పోలవరంలో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. అంతేగాక పాదయాత్రలో కేవీపీ రామచంద్రరావు తన భార్యతో సహా పాదయాత్రలో పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్‌ రఘువీరా, పళ్లంరాజు తదితరులు, గోదావరి జిల్లాల రైతులు, నిర్వాసితులు, ఇతరులు పాదయాత్రలో పాల్గొననున్నారు.