పాద‌యాత్ర‌పై వైఎస్ఆర్‌సిపి ముఖ్య నేత‌ల‌తో జ‌గ‌న్‌ చ‌ర్చ‌

jagan
jagan

హైద‌రాబాద్ః నగరంలోని లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్‌సిపి ముఖ్య నేతలతో ఆపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈనెల 6వతేదీ నుంచి జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3వేల కిలోమీటర్ల పాదయాత్ర జరగనుంది. ఆరునెలలపాటు పాదయాత్ర జరగనుండడంతో గురువారం పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పాదయాత్రతోపాటు పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది.