పాదయాత్రలోనే కాపులకు చంద్రబాబు హామీ

 

YENAMALA

విశాఖ: రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్ల అంశంపై ఆనాడు పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రలోనే చెప్పారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. ఆదివారం ఉదయం సిఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో కాపు రిజర్వేషన్‌, బిసిల్లో చేర్చటం వంటి అంశాలు, ముద్రగడ చేస్తున్న దీక్ష వివరాలు సిఎంతో చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఎవరో చేస్తున్న ఒత్తిడితో ప్రభుత్వం ఇవాళే కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోలేదని, పిఠాపురం పాదయాత్ర సమయంలో కాపు నాయకుల వినతితోనే అపుడు చంద్రబాబు హామీ ఇచ్చారని, అదే విషయాన్ని మేనిఫెస్టోలో చేర్చామని, ఇపుడు తాము అధికారంలోకి రాగానే వెంటనే కాపు రిజర్వేషన్లపై చర్యలు తీసుకుంటోందన్నారు. కేవలం ముద్రగడ అంటే కాపుకులం కాదని, కాపు అంటే ముద్రగడ కాదని, రాష్ట్రవ్యాప్తంగా మ్తొతంగా ఉన్న కాపు కులస్తుల్లో పేదలకు న్యాయం చేయటమే తమ ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ప్రజాస్వామ్యంలో దీక్షలు ఎవరైనా చేయవచ్చని అన్నారు. కిర్లంపూడిలో జరుగుతున్న పరిణాలను ఎప్పటికపుడు తగిన నివేదిక తెప్పించుకుంటూనే ఉన్నామన్నారు. ముద్రగడ ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించగా, అది వైద్యులు చూసుకుంటారన్నారు. బిసిల రిజర్వేషన్లకు ఎంటువంటి ఇబ్బందులు లేకుండా కాపులకు రిజర్వేషన్లు అందించాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే వెంటనే చర్యలు తీసుకుంటున్నా, ముద్రగడ దీక్ష చేపట్టటం ఎంతవరకు సమంజసం అన్నారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
======================================