పాత మిత్రులతో సరదాగా ఓ సాయంత్రం : బిగ్ బి ట్వీట్

Big B Tweet
Big B Tweet

పాత మిత్రులతో సరదాగా ఓ సాయంత్రం గడిపానని బిగ్ బి అమితాబ్ ట్వీట్ చేశారు. ఆ సందర్భంగా వారితో దిగిన ఓ ఫొటోను కూడా పోస్టు చేశారు. అమితాబ్ ఆయన భార్య, అలాగే జావేద్ ఆయన భార్య నటి షబనా ఆజ్మీ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫొటోను ట్వీట్ చేసిన అమితాబ్ ఆ సాయంత్రం వారితో అద్భుతంగా గడిపామని చెప్పారు. షోలే వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు జావేద్… అక్తర్ తో కలిసి కథలు సమకూర్చిన సంగతి తెలిసిందే.