పాత‌క‌క్ష‌ల నేప‌థ్యంలో దాడులు… ఒక‌రి ప‌రిస్థితి విష‌మం

Journalist Murdered
Murder at Kurnool check post

కర్నూలు: జిల్లాలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు చెక్‌పోస్టు వద్ద వైసీపీ నేత గౌరు వెంకటరెడ్డి అనుచరుడు రఘురామిరెడ్డిపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. ఈ దాడిలో రఘురామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రఘురామిరెడ్డి నందికొట్కూరు మండలం కోనేటమ్మపల్లె వాసి. గతంలో ఫ్యాక్షన్‌ హత్యకు రఘురామిరెడ్డి తండ్రి తిరుపతిరెడ్డి గురైనారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. ఫ్యాక్షన్ హత్యగా భావించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గౌరు వెంకటరెడ్డి హూటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. రఘురామిరెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.