పాత్ర నచ్చితే వారితో నటించేందుకు సిద్ధమే

KAJAL AGARWAL
KAJAL AGARWAL

సినీపరిశ్రమలోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నా కాజల్‌ అగర్వాల్‌ కు ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గలేదు..అయితే ప్రస్తుతం ఆమెకు అవకాశాలు కొంచెం తగ్గాయనే చెప్పాలి.. ప్యారీస్‌ ప్యారీస్‌ అనే ఒక తమిళ చిత్రంలో ఆమె నటిస్తోంది.ఈనేపథ్యంలో యువ హీరోలతో సైతం జతకట్టేందుకు కాజల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కథ, పాత్ర నచ్చితే యువ హీరోలతో నటించేందుకు తాను సిద్ధమని చెప్పింది.. కాలానికి తగ్గట్టుగా మారితేనే , ఇక్కడ నిలబడగలమని తెలిపింది.. 15ఏళ్లుగా నటిస్తున్నప్పటికీ , ఇప్పటికీ తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని, అదృష్టం ఉంటేనే ఇదంతా జరుగుతుందని కాజల్‌ చెప్పింది.. తాను అందంగా ఉంటానిని అందరూ అంటుంటారని, అందాన్ని కాపాడుకోవటానికి తాను నిరంతరం శ్రమిసూతనే ఉంటానని చెప్పింది.. పాత్రకు న్యాయం చేసేందుకు తాను శాయశక్తులా కృషిచేస్తానని చెప్పింది.. తెలుగులో శర్వానంద్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నాని తెలిపింది.