పాతఫోన్‌ ఇవ్వండి..కొత్త ఫోన్‌ తీసుకోండి

XIAOMI
XIAOMI

ముంబై: షావోమి 2017 నవంబర్‌లో ప్రారంభించిన ట్రేడ్‌ ఇన్‌ కార్యక్రమాన్ని ఇక మీదట తన వెబ్‌సైట్‌ ఎంఐడాట్‌కామ్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా షావోమి తన వినియోగదారులకు ఇన్‌స్టాంట్‌ఎక్ఛేంజ్‌ కూపన్లను అందిస్తోంది. ఈ కూపన్లతో వినియోగదారులు పాత స్మార్ట్‌ఫోన్లను ఇచ్చి, కొత్త ఫోన్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కాషీఫై భాగస్వామ్యంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని తొలుత అన్ని షావోమి స్టోర్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టోర్లకే పరిమితమైన ఈ ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ని షావోమి తన వెబ్‌సైట్‌ ఎంఐడాట్‌కామ్‌లోకి కూడా విస్తరించింది. ఎంఐ ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను పొందడానికి, ఒకవేళ మీకు ఎక్ఛేంజ్‌ ధర నచ్చితే మీ ఫోన్‌ ఐఎమ్‌ఇఐ నంబర్‌ సహాయంతో ఎక్ఛేంజ్‌ వాల్యూ కూపన్ని పొందవచ్చు. ఈ నగదు మీ ఎమ్‌ఐ అకౌంట్‌కి జమ అవుతుంది. ఆ ఎక్ఛేంజ్‌ సహాయంతో మీరు మీకు నచ్చిన కొత్త షావోమి ఫోన్‌ను తీసుకోవచ్చు. ఎక్ఛేంజ్‌లో ఫోన్‌కొనాలంటే కచ్చితంగా మీ పాత ఫోన్‌ పనిచేస్తూ ఉండి, ఎటువంటి ఫిజికల్‌ డ్యామేజ్‌ లేకుండా ఉండాలనే నిబంధనలను పెట్టింది కంపెనీ. షావోమి లిస్ట్‌లో ఉన్న ఫోన్లకే ఈ ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. వినియోగదారుడు ఒక్కసారి ఒక్క ఫోన్‌ను మాత్రమే ఎక్ఛేంజ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఎక్ఛేంజ్‌ కూపన్‌ వాలిడిటి కేవలం 14 రోజులు మాత్రమే. ఈ ఆఫర్‌ కేవలం స్మార్ట్‌ఫోన్లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.