పాతనోట్ల మార్పిడి గడువుపై ఆగ్రహం

notice
Supreme court notice

పాతనోట్ల మార్పిడి గడువుపై ఆగ్రహం

న్యూఢిల్లీ: రద్దయిన పెద్దనోట్ల మార్పిడి గడువుపై సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వం, ఆర్‌బిఐపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి, ఆర్‌బిఐకి నోటీసులు జారీచేసింది.. రద్దయిన నోట్లను డిసెంబర్‌ 31లోగా మార్చుకోలేకపోయినవారు సరైన కారణాలు ఉంటే మార్చి 31 వరకు మార్చుకోవచ్చనుని గత ఏడాది నవంబర్‌ 8న ప్రధాని మోడీ హామీ ఇచ్చారని సుప్రీం కోర్టు గుర్తుచేసింది.. రద్దయిన నోట్లను మార్చుకోవటానికి ఒక కౌంటర్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.. ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.