పాతకక్షల నేపథ్యంలో హత్యాయత్నం

Journalist Murdered
Murder Attempt

పెద్దపల్లి: బిజెపి చెందిన ఓ నాయకుడిపై హత్యయత్నం జరిగింది. కత్తులతో తీవ్రంగా పొడిచారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలో వెన్నంపల్లిలో బిజెపి నాయకుడు ఈర్ల శంకర్‌పై ఇరువురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా పాతకక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.