పాడేరు మన్యంలో అకాల వర్షం

Rain in Paderu
Rain in Paderu

విశాఖ: పాడేరు మన్యంలో నేడు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్క ఉదుటున ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో అరకు,పాడేరులలో చెట్లు నేలకొరిగాయి. అదే విధంగా చింతలవీధిలో విద్యుత్‌ స్తంభం కూలిపోగా ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి.