పాఠ‌శాల‌లో పేలుడు.. సిబ్బందికి గాయాలు

Bomb blast in School
Bomb blast in School

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ దోడా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. శివగ్రామంలో జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌తో సహా ఇద్దరు గాయపడ్డారు. ప్రిన్సిపాల్‌ హోసియార్‌ సింగ్‌ తన సహా ఉద్యోగులతో కలిసి పాఠశాలలోని అతని కార్యాలయంలో ఉండగా ఈ పేలుడు చోటుచేసుకుందని సమాచారం. ఘటనలో ప్రిన్సిపాల్‌, సహోద్యోగికి గాయాలయ్యాయి. గదిలో మంటలు వ్యాపించడంతో ఫర్నిచర్‌, డాక్యుమెంట్లు ధ్వంసమయ్యాయి. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ పేలుడుకి గల కారణాలను నిర్ధారించడానికి జమ్ము నుండి ఫోరెన్సిక్‌ నిపుణులు వస్తున్నారు