పాఠశాలల్లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధం

Jagruti Pandya
Jagruti Pandya

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ మల్లీ ప్లేయర్‌ గేమ్స్‌ పై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్దర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్ పై పాఠశాల విద్యార్థులు బానిసలుగా మారుతుండటంతో వారి చదువులు దెబ్బతింటున్నాయని గుజరాత్ బాలల హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ జాగృతి పాండ్యా చెప్పారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్ ఆడకుండా నిషేధం విధించాలని విద్యాశాఖాధికారులకు  ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. అంతేకాక దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్ ఆడకుండా నిషేధం విధించాలని జాగృతి పాండ్యా డిమాండు చేశారు.