పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం
fire-accident-in-school
హైదరాబాద్: పాతబస్తీ గౌలిపురలోని ఓ పాఠశాలలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్ కింది అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది,. ఈప్రమాదంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటలు చెలరేగిన అంతస్తులోని ఫర్నీచర్, రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది నిర్ధారించింది. కాగా, ఆ సమయంలో పాఠశాలలో ఉన్న 23 మంది విద్యార్థులు సురక్షితంగా ప్రమాదం నుండి బడయపడ్డారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/