పాక్ వన్డే కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా వెనక్కి
లాహోర్ : పాకిస్థాన్ వన్డే కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా వెనక్కి తీసుకున్నాడు. కాగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అమీర్ పునరాగమనంపై ఆ జట్టులో డ్రామా కొనసాగుతుంది. అమీర్‌ను జాతీయ శిక్షణా శిబిరంలో చేర్చడాన్ని నిరసిస్తూ తాజాగా వన్డే కెప్టెన్ అజహర్ అలీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్‌ఖాన్ బుజ్జగింపులతో అతను తన రాజీనామాను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ శిబిరంలో అమీర్ ఉంటే తాము హాజరుకామని అజహర్,హఫీజ్‌లు నిరసన ప్రకటించారు. అయితే పాకిస్థాన్ బోర్డు జోక్యంతో ఇది సద్దుమణిగింది. న్యూజిలాండ్ పర్యటన కోసం సిద్దమవుతున్న 26 మంది సభ్యుల పాకిస్థాన్ బృందంలో అమీర్‌ను ఎంపిక చేశారు.