పాక్ మంత్రి వివాదాస్పాద వ్యాఖ్యలు
భారత్‌కు మద్దతిస్తే క్షిపణితో దాడి చేస్తాం

ఇస్లామాబాద్: కశ్మీరు సమస్యపై భారత్‌కు ఏ దేశమైనా మద్దతు ఇస్తే దానిపై పాకిస్తాన్ క్షిపణి దాడి జరుపుతుందని పాకిస్తాన్‌కు చెందిన కశ్మీరు, గిల్గిట్ బల్టిస్తాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమీన్ గండాపూర్ హెచ్చరించారు. కశ్మీరు వ్యవహారంలో భారత్‌కు అండగా నిలబడే దేశాన్ని తమ శత్రు దేశంగా పరిగణిస్తామంటూ ఆయన వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరు విషయమై భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరమైన పక్షంలో పాకిస్తాన్ యుద్ధానికి వెళ్లక తప్పదని ఆయన అన్నారు. అందువల్ల పాకిస్తాన్‌ను కాకుండా భారత్‌కు మద్దతునిచ్చే దేశాన్ని తమ శత్రువుగా పరిగణించడమేకాక భారత్‌తోపాటు ఆ దేశాలపై క్షిపణి దాడులు జరుగుతాయని పాక్ మంత్రి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/