పాక్‌ తొలి హిందూ మహిళా జడ్జి సుమన్‌ కుమారి

suman kumari
suman kumari

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్‌ కుమారి నిలిచారు. ఖంబర్‌-షాదాద్‌కోట్‌కు చెందిన ఆమె తన సొంత జిలాలలోనే సివిల్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పాక్‌లోని హైదరాబాద్‌లో ఆమె తన ఎల్‌ఎల్‌బి చేశారు. కరాచీలోని షాబిస్త్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఖంబర్‌-షాదాద్‌కోట్‌లోని పేదలకు ఉచితంగా న్యాయం చేయడమే ఆమె లక్ష్యమని సుమన్‌ తండ్రి పవన్‌ కుమార్‌ చెప్పారు.