పాక్‌ జట్టులో తొలి సిక్కు క్రికెటర్‌ మనీందర్‌ సింగ్‌

SINGH
Manirder Sing

పాక్‌ జట్టులో తొలి సిక్కు క్రికెటర్‌ మనీందర్‌ సింగ్‌

 

న్యూఢిల్లీ: గతంలో డానిష్‌ కనేరియా ఒక హిందువుగా పాకిస్థాన్‌ జట్టులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.కాగా తాజాగా మనీందర్‌ పాల్‌ సింగ్‌ అనే సిక్కు కుర్రాడు అలాంటి ఘనతనే సాధించాడు.ఫాస్ట్‌ బౌలర్ల కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో జాతి సెలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఒక క్యాంపునకు ఎంపికయ్యాడు.కాగా నవంబర్‌ 21న ముల్తాన్‌లోని పిసిబి ఏర్పాటు చేసిన ఈ క్యాంపునకు మనీందర్‌ పాల్‌ సింగ్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు లో చోటు సంపాదించిన తొలి సిక్కు ఆటగాడిగా 21 సంవత్సరాల మనీందర్‌ రికార్డులకెక్కాడు

కాగా ఈ సందర్భంగా మనీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ క్యాంపునకు ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని పేర్కొన్నాడు.పాకిస్థాన్‌లోని గిరిజన తెగకు చెందిన మనీందర్‌ లాహోర్‌సరిహద్దు ప్రాంతమైన నంకానా సాహిబ్‌లో నివరిస్తున్నాడు.కాగా అయిదుగురు అన్నదమ్ముల్లో మనీందర్‌ సింగ్‌ పాల్‌ పెద్దవాడు కాగా,సిక్కు కమ్యునిటీలో ఈ స్థాయికి ఎదిగిన తొలి క్రికెటర్‌ ఇతనే కావడం విశేషం.దేశంలోని నైపుణ్యం ఉన్న ఇతర క్రికెటర్లతో కలిసి శిక్షణ తీసుకోవడం గొప్ప అనుభవమని పేర్కొన్నాడు.ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నానని, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ఆడటమే తన టార్గెట్‌ అని పేర్కొన్నాడు. తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని,మెట్రిక్యులేషన్‌ తరువాత క్లబ్‌ స్థాయిలో ఆడానని, లాహోర్‌లోని అకాడమీలో ఊడాఆడానని మనీందర్‌సింగ్‌ పేర్కొ న్నాడు. కాగా మనీందర్‌ పాల్‌ సింగ్‌ ప్రస్తుతం పంజాబ్‌ యూనివర్శిటీ ఫార్మసీ విద్యార్థిగా ఉన్నాడు.కాగా 15 సంవత్సరాల క్రితం పాల్‌ సింగ్‌ తండ్రి నాన్కాస్‌ సాహేజ్‌ ప్రాంతం నుంచి పాకిస్థాన్‌లోని కైబర్‌ ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చారు.పాల్‌ తండ్రి కూడా స్వతహాగా క్రికెట్‌ లవర్‌ కావడం విశేషం.