పాక్‌లో భారత రాయబారి నివాసానికి కరెంట్‌ నిలిపివేత

 

PAK-INDIA
PAK-INDIA

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ లోని భారత రాయబారి నివాసానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 2018 డిసెంబర్‌ 25న నాలుగు గంటల పాటు(ఉదయం 7నుండి 10:45వరకు) కరెంట్‌ కట్‌ చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని భారత్‌ ఎంబసీ అధికారులు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల పలువురికి అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పాక్ విదేశాంగ శాఖ మంత్రికి భారత ఎంబసీ అధికారులు కోరారు.