పాక్‌కు న‌దీజ‌లాలు నిలిపివేత‌

పాక్‌ ఉగ్రవైఖరికి జవాబుచెపుతున్న భారత్‌
మిగులుజలాలను భారత్‌వైపునకే మళ్లింపు
న్యూఢిల్లీ: పుల్వామా దాడితో పాకిస్తాన్‌తో అన్నివైపులనుంచి తెగతెంపులు చేస్తున్న భారత్‌ తాజాగా నదీజలాలనుసైతం అడ్డుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించాలనినిర్ణయించింది. భారత్‌నుంచి పాకిస్తాన్‌వైపు వెళ్లే మూడు నదులకు సంబంధించిన జలాలు పాకిస్తాన్‌వైపునకు వెళ్లకుండా భారత్‌ పరీవాహక ప్రాంతంలోనే ఆనకట్టలు నిర్మిస్తోంది. యుమునా నది జిలాలను రెండు దేశాలు వినియోగించుకునే సౌలభ్యం ఉంది. ఇండస్‌ నదీజలాల ఒప్పందం 1960లో సంతకాలు జరిగిన తర్వాతనుంచి మూడునదుల జలాలపై రెండుదేశాలు వినియోగించుకునే సౌలభ్యం కలుగుతున్నది. కానిభారత్‌ మాత్రం నదీజలాలను అనుమతించినమేరకు ఇప్పటికీ వినియోగించుకోలేదు. భారత్‌, పాకిస్తాన్‌ల ఆవిర్భావం తర్వాత పాకిస్తాన్‌కు ఈమూడు నదుల జలాలను వినియోగించుకునే హక్కులు లభించాయి. భారత్‌వైపునుంచి మూడునదుల జలాలు పాకిస్తాన్‌లోనికివెళుతునానయి. అందువల్లనే ఈ నదీజలాలను అడ్డుకట్టవేసేందుకు భారత్‌వైపు ప్రాజెక్టును నిర్మించి వాటిని యమునా నదిలోనికి మళ్లించాలని నిర్ణయించారు. ఒకసారి అంటూ ఈ బదలాయింపు జరిగితే యమునా నదికి మరిన్ని నదీజలాలు వస్తాయని కేంద్ర రోడ్లురవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో బుధవారం జరిగిన ఒక సదస్సుకు కేంద్ర మ్తంరి హాజరయ్యారు. అంతేకాకుండా ఈ మూడుప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగాప్రకటించామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇందుకు పునాదులు వేసిందన్నారు తూర్పుప్రాంత నదుల జలాలను మనవైపు ఉన్న జమ్ముకాశ్మీర్‌, పంజాబ్‌ప్రజలకు వినియోగించుకునేందుకు మళ్లిస్తామని జలవనరుల మంత్రి, గంగాప్రక్షాళన మంత్రి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో రావినదిపై షాపూర్‌ ఖండివద్ద డామ్‌ నిర్మాణం ప్రనారంభించామని యుజెహెచ్‌ప్రాజెక్టు మన వాటాకు వచ్చే జలాలను జమ్ముకాశ్మీర్‌లో వినియోగించేందుకు మళ్లిస్తామన్నారు. మిగిలిన జలాలను రావిబియాస్‌ అనుసంధానంతో ఇతర రాష్ట్రాల బేసిన్‌లకు మళ్లిస్తామని వెల్లడించారు. జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో గత వారం ఉగ్రదాడి సంఘటనను పురస్కరించుకుని భారత్‌ పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచుతున్న సంగతి తెలిసిందే. దిగుమతులపై 200శాతం సుంకాలను విదించిన కేంద్రం అత్యంత సానుకూలదేశం హోదాను రద్దుచేసింది. తాజాగా ఇపుడు నదీజలాల వాటాలను వినియోగించుకోవడం ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లే జలాలను మళ్లించేందుకు నిర్ణయించింది. ఓపక్క విదేశాంగశాఖ ఇప్పటికే ప్రపంచదేశాలతో దౌత్యసంబంధాలద్వారా జమ్ముకాశ్మీర్‌పై ఒత్తిడిని పెంచేందుకు యత్నిస్తోంది. పి5 దేశాలతోపాటు అమెరికా, యుకె, ఫ్రాన్స్‌,రష్యా, చైనా దేశాలు ఇప్పటికే జైషేముహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌అజర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలన్న డిమాండ్‌కు చైనా వీటో అధికారాన్ని వినియోగించి ఆంక్షలను అడ్డుకోవడం వంటి సంఘటనలతో ఇపుడు భారత్‌ తనకుతానే సొంతంగా ఉన్న అన్ని వనరులను వినియోగిస్తోంది. ఈమూడునదులపై డ్యామ్‌లను నిర్మించడంద్వారా వినియోగించనిజలాలను ఇప్పటివరకూ పాకిస్తాన్‌కు వెళుతున్నవాటిని డ్యామ్‌ల సాయంతో భారత్‌లోనే ఇతర రాష్ట్రాలకు మళ్లించాలనినిర్ణయించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరిలోనే గడ్కరీ మాట్లాడుతూ భారత్‌ వాటా జలాలు పాకిస్తాన్‌కు వెళుతున్నాయని, ఇకపై వీటిని అడ్డగించి మనకు రావాల్సిన వాటా జలాలను మనకే మళ్లిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇండస్‌ వాటర్స్‌ ఒప్పందం పరిధిలో కొన్ని షరతులకు లోబడి భారత్‌కు ఈ మూడు నదులు అంటే బియాస్‌, రావి, సట్లెజ్‌నదుల జలాలను వినియోగించుకునే హక్కులున్నాయి. పాకిస్తాన్‌కు పశ్చిమప్రాంత నదుల జలాలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇండస్‌, ఝెలమ్‌, చెనాబ్‌ నదుల జలాలను వినియోగించుకుంటున్నది. ఇకపై భారత్‌ కార్యాచరణతో తూర్పుప్రాంతంలోని నదులజలాలనుసైతం వినియోగించుకునేందుకువీలులేకుండా అవసరమైన భారత్‌ రాష్ట్రాలకు మళ్లించాలనినిర్ణయించింది. ఇందుకోసం నిర్మించతలపెట్టిన మూడు డ్యామ్‌లను జాతీయ ప్రాజెక్టులుగానే నిర్ణయించడంతో శరవేంగంగా ఈ ప్రాజెక్టులు పూర్తిచేసే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే రెండుదేశాలమధ్య అటు దౌత్యపరంగాను, ఇటు రక్షణరంగపరంగాను సంబంధాలు బెడిసికొట్టాయి.వాస్తవాధీనరేఖవెంబడి తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌పై అంతర్జాతీయ సమాజం వేపునుంచి కూడా ఒత్తిడిని పెంచాలనిభారత్‌నిర్ణయించింది. పనిలోపనిగా అగ్రరాజ్యాల మద్దతు కూడగడుతోంది. ఒక్క చైనా మినహాయిస్తే ప్రపంచంలోని 60శాతం దేశాలు మసూద్‌ అజర్‌, ఆయన సంస్థను నిషేధిత జాబితాలో చేర్చాలన్న భారత్‌ డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నాయి. అదేకానిపక్షంలో భారత్‌వైపునుంచి అన్ని వనరులను వినియోగించి పాకిస్తాన్‌ను ఏకాకినిచేయాలన్న లక్ష్యం ఇపుడిపుడే కార్యాచరణకు వస్తోంది. ఈ ప్రాజెక్టులు కనుక పూర్తి అయితే ఇకపై భారత్‌కు ఒక్కచుక్కకూడా జలాలు వెళ్లవని అంచనా.