పాక్‌కు అమెరికా సాయం క‌ట్‌

pak,  US
pak, US

పాకిస్థాన్‌కు రక్షణయేతర సహాయాన్ని నిలిపివేసే బిల్లును అమెరికా ప్రజా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అటు వంటి సహాయం టెర్రరిస్టులకు పరోక్షంగా అందుతున్నందున ఆ మొత్తాన్ని దేశంలోని మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు కల్పించాలని కోరుతూ బిల్లును కాంగ్రెస్‌ సభ్యుడు మార్క్‌ స్టాన్‌ఫోర్డ్‌, థామస్‌ మాసి ప్రతిపాదించారు. పాకిస్థాన్‌కు అమెరికన్‌ పన్ను చెల్లింపుదార్లు డబ్బు పోకుండా ఈ శాసనం అమెరికా విదేశాంగ శాఖను, అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీని నిరోధిస్తోంది. అందుకు బదులుగా ఈ నిధులను అమెరికాలో హైవే ట్రస్ట్‌ ఫండ్‌కు మళ్లిస్తారు. ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే దేశానికి సహాయప్డడం మానుకోవాలని మెస్పి ఈ బిల్లును ప్రాతిపాదిస్తూ డిమాండ్‌ చేశారు.