పాక్షిక సవరణలు

ప్రజావాక్కు

                                        పాక్షిక సవరణలు

supreem court
supreem court

పాక్షిక సవరణలు
ఎంతో కాలంగా దుర్వినియోగానికి గురవ్ఞతున్న ఎస్సీ,ఎస్టీ దురాగతాల నివారణ చట్టానికి పాక్షిక సవరణలను సుప్రీంకోర్టు చేయడం ముదావాహం. పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి అను కూలంగాజరిగిన ఈ సవరణపై విపక్షాలురాజకీయ దురుద్దేశ్యం తో ఉద్యమాలు లేవనెత్తడం, దళితులను ఈ సవరణకు విరు ద్ధంగా రెచ్చగొట్టడం బాధాకరం. ఈ చట్టంకింద వేలాది మంది అమాయకులపై దురుద్దేశంతో కేసులు పెట్టి పీడించడం జరి గిందన్నగణాంకాలపై సుప్రీంకోర్టు తగురీతినస్పందించి న్యాయ పాలికపై ప్రజలకు విశ్వాసాలు నిలిచివ్ఞండేలా చేసింది. తప్పు డు ఫిర్యాదులని దర్యాప్తులో తేలితే బెయిల్‌పై ఆంక్షలు ఎత్తి వేయడం, ఫిర్యాదు అందిన వెంటనే అరెస్ట్‌ చేయాలన్న నిబం ధనఎత్తివేయడం మంచి పరిణామం.ఓటు బ్యాంకు రాజ కీయ వలనవిపక్షాలకే నష్టం జరుగనున్నది. సుప్రీంకోర్టు తీర్పు వలన మెజారిటీ ప్రజలు హర్షం వెలిబుచ్చడాన్ని విపక్షాలు గుర్తించాలి.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు
దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట కొన్నిప్రాంతీయ పార్టీల నాయ కులు అడుగులు వేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌, బి.జె.పిలకు అతీతంగా పాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా, అది ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. కానీ ప్రస్తుతం రెండు ప్రధాన జాతీయ పార్టీలు బలహీనపడటం చాలా ప్రాంతీయ పార్టీలు బలంగా కనబ డటం జరుగుతోంది. మూడో ఫ్రంట్‌ లేదా ఫెడరల్‌ ఫ్రంట్‌ అని పేర్కొంటున్న కెసిఆర్‌ లక్ష్యం వివిధ రాష్ట్రాల్లోని ప్రాం తీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్‌, బిజెపి కూటము లకు సమాంతరంగా మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి 2019 లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలన్నదే వ్యూహంగా కనిపిస్తోం ది. అయితే మూడో ఫ్రంట్‌ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని తెరపైకి తేవడం ఆశ్చర్యంగా ఉంది.
-జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాల 

పేదరికాన్ని నిర్మూలించాలి
ప్రపంచబాలల జనాభాలో15శాతం బాలకార్మికులేనని, ప్రపం చవ్యాప్తంగా 27కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారని, బాలకా ర్మికులలో భారత్‌ది12వస్థానమని ఇటీవలి అంతర్జాతీయ కార్మి కసంస్థ నివేదిక క్షేత్రస్థాయిలో బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంచేస్తోంది. పరిశ్రమలు, గనులు, తవ్వకాలు, వ్యవసాయం, తల్లిదండ్రుల వ్యాపారాలలో పాలుపంచుకోవడం వంటి పనులలో బాలలు నలిగిపోతున్నారు.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తిరుమలలో ఏం జరుగుతోంది?
కలియుగ వైకుంఠంలో జరుగరానివేవో జరుగుతున్నాయని శ్రీవారికి నిత్యం కైంకర్యాలు పూజలు శాస్త్రోస్త్రంగ జరపడం లేదని వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు, విలువైన వజ్రం మాయమయ్యాయని రమణదీక్షితులు ఆరోపిస్తున్నారు. అయితే అంతా ఉట్టిదేనని ఆయన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ప్రస్తుత పాలక మండలి సభ్యులు అంటున్నారు. పాక్షితులను దుమ్మెత్తిపోస్తున్నారు.వీరిలో ఎవరు నిజం చెప్తున్నారో తెలుసు కోలేక ప్రజలు అయోమయానికి గురవ్ఞతున్నారు. తిరుమలలో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తూ విస్తుపోతున్నారు. దేశంలో కూడా పరిస్థితులు ఇలానేఉన్నాయి. రాజకీయాలు కుళ్లి పోయి కంపుకొడుతున్నాయి. పాలక ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు,వివాదాలతో దేశం మొత్తం అట్టుడికిపోతోంది..
-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

వృద్ధాశ్రమాలను ప్రభుత్వాలే నిర్వహించాలి
నేడు వృద్ధాశ్రమాల నిర్వహణ పెద్ద వ్యాపారంగా మారిపో యింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ తమ వృద్ధు లైన తల్లిదండ్రులను ఈ ఆశ్రమాలలోనే విడిచిపెడుతున్నారు. అందుకు అయ్యే ఖర్చును చెల్లించడానికి వెనుకాడడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రుల భారాన్ని బాధ్యతగా స్వీకరించాలి. వారితో కలిసి ఆనందంగా జీవించాలనే ఆలోచన లను పక్కనపెడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు చెదిరిపో యాయి. చిన్న కుటుంబాలు ఏర్పడుతుండడంతో ఈ దుస్థితి ఏర్పడిందన్నది కాదనలేని నిజం. ప్రభుత్వం వృద్ధాశ్రమాలను నిర్వహిస్తే పేద వృద్ధులకు ఆసరాగా ఉంటుంది.
-బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

అరణ్యరోదనే
సమాజంలో సగభాగమైన స్త్రీలు స్వేచ్ఛగా జీవించే స్థితి, భద్రంగా బతికే పరిస్థితి కానరావడం లేదనడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న లైంగికదాడులు, వేధింపులు,గృహహింస, పరువ్ఞ హత్యలు, వరకట్నదాడులు ఇలా ఎన్నెన్నో చెప్పవచ్చు. చట్టాలు ఎన్నివ్ఞన్నా కొత్తగా వస్తున్న అవి నేరస్తులకు చుట్టాలుగా ఉన్నాయే తప్ప తగిన శిక్షలు పడటం లేదు. నిర్భయ చట్టం అమలులో ఉన్న నేరస్తులకు భయంలేదు. మానవమృగాలు జనారణ్యంలో యధేచ్ఛగా మారణహోమం సాగిస్తున్నాయంటే మహిళల మానప్రాణాలకు బలికొంటున్నారంటే పాలకుల వైఫల్యం అధికారుల నిర్లక్ష్యం నైతిక విలువల పతనం రక్షకులే భక్షకులుగా మారడం మొదలైన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇకనైనా పాలకులు కళ్లు తెరవాలి.
-ఉలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా