పాకిస్థాన్‌ హాకీ కీపర్ మన్సూర్ అహ్మద్ మృతి

Mansoor Ahmed
Mansoor Ahmed

పాకిస్థాన్‌ హాకీ వరల్డ్ కప్ విజేత, గోల్ కీపర్ మన్సూర్ అహ్మద్(49) మృతి చెందాడు. గత కొన్నేళ్లుగా మన్సూర్ దీర్ఘకాలిక గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు గుండె మార్పిడి తప్ప మరో అవకాశం లేదని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం సహాయం చేయాల్సిందిగా భారత్‌కు మన్సూర్‌ విజ్ఞప్తి చేశాడు. మన్సూర్‌కు గుండెకు శస్త్ర చికిత్స చేసినా.. లాభం లేకపోయింది. దీర్ఘకాలిక గుండె జబ్బుతో శనివారం మధ్యాన్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పాక్ వైద్యుడు నవీద్ తెలిపారు. 1994 వరల్డ్‌కప్‌ పెనాల్టీ షూటౌట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి మన్సూర్ పాక్‌ను విజేతగా నిలిపాడు.