పాకిస్థాన్‌ దేశవాళీ టోర్నీలో సిక్కు క్రికెటర్‌

mahindra
mahindra

పాకిస్థాన్‌ దేశవాళీ టోర్నీలో సిక్కు క్రికెటర్‌ మహీందర్‌ పాల్‌ సింగ్‌

కరాచి: పాకిస్థాన్‌ దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్న కొద్ది మంది సిక్కు క్రికెటర్లలో ఒకడిగా మహీందర్‌ పాల్‌ సింగ్‌ అరుదైన ఘనత సాధించాడు.21 సంవ త్సరాల మహీందర్‌ అనే యువకుడు కాండీలాండ్‌ తరుపున పాక్‌ దేశవాళీ టోర్నీ పాట్రిన్స్‌ ట్రోఫీ గ్రేడ్‌-2 టోర్నీలో పాల్గొన్నాడు.కరాచీ పోర్టు జట్టుపై తొలి మ్యాచ్‌ ఆడిన మహీందర్‌ ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.అయితే గాయం కార ణంగా రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయలేక పోయాడు.ఈ మ్యాచ్‌లో ఆడటంపై మోహీందర్‌ ఆనందం వ్యక్తం చేశాడు.2015లో కాండీలాండ్‌ జట్టు నిర్వహించిన పరీక్షకు హాజరైన మహీందర్‌ రెండు సంవత్సరాల తరువాత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాండీలాండ్‌ జట్టు మేనేజర్‌ బపాల్త్‌ మీర్జా నుంచి పిలుపు రావడంతో తాను ఎంతో సంతోషానికి గురైనట్లు వెల్లడించాడు.పాకిస్థాన్‌లో సుమారు 20 వేల సిక్కు జనాభా ఉంది.మోహిం దర్‌ వెస్ట్‌ లాహోర్‌ నాన్కానా సాహెబ్‌ ప్రాంతానికి చెందిన వాడు.లాహోర్‌లో డాక్టర్‌గా పని చేసే మోహిందర్‌ తండ్రి తన కుమారుడి క్రీడాసక్తి గమ నించి ప్రోత్సహించినట్లు పేర్కొన్నాడు.మోహిందర్‌ కన్నా ముందు గులాబ్‌సింగ్‌ అనే సిక్కు యువకుడు తొలిసారి దేశవాళీల్లో పాల్గొన్న సం గతి తెలిసిందే.కొన్ని సంవత్సరాల కిందట రెండు, మూడు దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన తరువాత అతను వెలుగులోకి రాకుండా పోయినట్లు స్థానిక క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్థాన్‌ జట్టు తరుపున ఏడుగురు ముస్లింలు కానీ క్రికెటర్లు ఆడారు. అందులో ఐదుగురు క్రిస్టియన్లు, ఇద్దరు హిందువులున్నారు.