పాంచాలీ ఎంత డిమాండ్‌ చేస్తుందో?

NAYANATARA-1
NAYANATARA

పాంచాలీ ఎంత డిమాండ్‌ చేస్తుందో?

తమిళంలో నయనతార నెంబర్‌ 1 పొజిషన్‌లో కొనసాగుతోంది.. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ హిట్‌ ట్రాక్‌లో ఉన్న నయన్‌ తన రెమ్యూనరేషన్‌ కూడ భారీ లెవల్లోనే వసూలు చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపెట్టే రకం.. ఇక్కడ తెలుగులో ప్రస్తుతం నయనతార, బాలకృష్ణ.. రవికుమార్‌ చౌదరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్‌గా నటించటానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు.దీనికి గానూ నయన్‌ మంచి రెమ్యూనరేషన్‌ వసూలు చేస్తుందనే టాక్‌ కూడ ఉంది.
ఇకపోతే నయనతార ఇపుడు 1000 కోట్ల భారీబడ్జెట్‌ చిత్రంగా రాబోతున్న మహాభారతంలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. శ్రీ మీనన్‌ డైరెక్షన్‌లో బడా బిజినెస్‌ మాన్‌ 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మహాభారతాన్ని తెరకెకించబోతున్నారు.. ఇక ఈ మహాభారతంలో ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ భీముడి పాత్రకి ఎంపిక కాగా మిగతా పాత్రలకు కూడ నటీనటుల ఎంపిక జరుగుతుందట. అయితే ఈచిత్రంలో పాంచాలి పాత్ర కోసం నయనతారని మూవీ యూనిట్‌ సంప్రదించినట్టు ప్రచారం ఉంది..అయితే సాధారణ మూవీకే షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ రాబడుతుండే నయన్‌ ఈ వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌ చిత్రానికి ఇంకెంత డిమాండ్‌ చేస్తుందో అంటున్నారు.