పసిడి అంతర్జాతీయ డిమాండ్‌ 2% మాత్రమే!

GOLD
GOLD

పసిడి అంతర్జాతీయ డిమాండ్‌ 2% మాత్రమే!

 

న్యూఢిల్లీ,: అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ 2016వ సంవత్సరం లో రెండుశాతంపెరిగి 4309 టన్నులకు చేరింది. పసిడి ఆధారిత ఎక్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్స్‌, కడ్డీలు, నాణేలపరంగా చైనాలోను గిరాకీపెరగడమే ఇందుకు కారణమని ప్రపంచ పసిడి మండలి వెల్లడించింది. ప్రపంచ పసిడిమండలి గణాంకాల ప్రకారంచూస్తే 2015లో బంగారం డిమాండ్‌ 4216 టన్నులుగా ఉంది. 2013 తర్వాత గత ఏడాదే డిమాండ్‌ కొంత మేర పెరిగిందని మండలి అంచనా. పసిడిపై నిర్వ హిస్తున్న ఇటిఎఫ్‌లలోకి పెట్టుబడులు ఎక్కువ రావ డమే ఇందుకు కీలకమని మొత్తం 532 టన్నుల వరకూ ఇటిఎఫ్‌ కొనసాగినట్లు అంచనా. ఇన్వెస్టర్లు కూడా భవిష్యత్తు ద్రవ్యవిధాన సమీక్షలపై సందే హాలు వ్యక్తంచేయడం, భౌగోళిక అనిశ్చితిపరిస్థితులు ప్రతికూల వడ్డీరేట్లు కారణంగా ఎక్కువ బంగారం పైనే పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపించారు. ఇక చైనావిషయానికి వస్తే కడ్డీలు, నాణేలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. నాలుగోత్రైమాసికంలో మరిం తగా ఉన్నట్లు అంచనా. నవంబరులో కరెన్సీ సంక్షో భం కూడా కొంత పెట్టుబడుల డిమాండ్‌ను పెంచిం ది. దీనితో ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ 70శాతానికి పెరిగింది. నాలుగేళ్ల గరిష్టస్థాయికి అంటే 1561 టన్నులకు చేరిందని ప్రపంచ పసిడిమండలి ఎండి సోమసుందరం పిఆర్‌ వెల్లడించారు. బ్రెగ్జిట్‌, అమె రికా అధ్యక్ష ఎన్నికలు, ఇతర రాజకీయ భౌగోళిక పరిస్థితులవల్ల కూడా పెట్టుబడులడిమాండ్‌ పెరిగిం దని, అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ పరిస్థితులు కొంత తోడయ్యాయిన ఆయన అన్నారు. ఇక పసిడి రంగంపై మొత్తం పెట్టుబడుల డిమాండ్‌ వేగవంతం అయింది. ఆభరణాలు వంటి వాటితో సమన్వయం ఉంది. జ్యుయెలరీపరంగా 15శాతంతగ్గింది. 2016 లో 2042టన్నులకు చేరింది. కేంద్రబ్యాంకు కూడా పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. కేంద్ర బ్యాంకువద్ద కూడా గత ఏడాది మొత్తంగాచూస్తే 384 టన్నుల నిల్వలున్నట్లు అంచనా. ప్రపంచంలోని రెండు అగ్ర గామి పసిడి మార్కెట్లు భారత్‌, చైనాలు కూడా కొనుగోళ్లు మందగించడంతో డిమాండ్‌ కూడా తగ్గిం ది. 21శాతం, ఏడుశాతంగా ఉన్నాయి. చైనాలో ఆభరణాల డిమాండ్‌ కొంత దెబ్బతిన్నది. ఏడాది మొత్తంగా ధరలు ఎక్కువ కొనసాగడమే ఇందుకు కీలకం. వీటికితోడు కరెన్సీసంక్షోభం కూడా భారత్‌, చైనాలో కూడా వెంటాడింది. భారత్‌లో కూడా 2016 ఆసాంతం సవాళ్లతోనే కొన సాగింది. ఆకస్మికంగా ప్రకటించిన నోట్లరద్దు పసిడి డిమాండ్‌, ఆభరణాల కొనుగోళ్లు, రిటైల్‌ పెట్టుబ డులరంగంపై తీవ్రప్రభావం చూపించినట్లు ప్రపంచ పసిడిమండలి తననివేదికలో ఉటంకించింది. భారత్‌ లో పెద్దనోట్ల రద్దు పసిడి డిమాండ్‌ను 15శాతం దిగజార్చింది. 2016 కేలండర్‌ సంవత్సరంలో 27.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది 32 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఏడాది మొత్తంగా పసిడి డిమాండ్‌ అంతకుముందు ఏడాది 857.2టన్నులతో పోలిస్తే 675.5 టన్నులకు చేరింది. డాలర్‌ విలువల్లో చూస్తే 21.2శాతం తగ్గింది. భారత్‌ పసిడి డిమాండ్‌ మొత్తంగాచూస్తే 27.2బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని తెలు స్తోంది. కెవైసి నిబంధనలు పాటించాలని, రెండు లక్షల కొనుగోళ్లపై పాన్‌నంబరు తప్పనిసరి అన్న విధానాలతో డిమాండ్‌పూర్తిగా పడిపోయింది. అలాగే నగదు లావాదేవీలను మూడులక్షలకు మించి చేస్తే డిజిటల్‌ రూపంలో ఉండాలన్న నిబంధనలు కూడా పసిడిరంగంపై ఎక్కువప్రభావం చూపి స్తాయనడంలో సందేహంలేదు. ఆభరణాల డిమాండ్‌ 662.3 టన్నుల నుంచి 514 టన్నులకు పడిపోతే పెట్టుబడులపరంగా డిమాండ్‌ 17శాతం తగ్గింది. 194.9 టన్నుల నుంచి 161.5 టన్నుల కు పడిపోయిందని పసిడిమండలి అంచనావేసింది.