పశ్చిమ బంగా, ఒడిశాలపై ‘పెథాయ్‌’

CYCLONE EFFECT
CYCLONE EFFECT

కోల్‌కత్తా, భువనేశ్వర్‌: ఏపిలోని కోస్తాంధ్రను వణికిస్తున్న పెథాయి తుఫాను తూ.గో.జిల్లా కాట్రేనికోన వద్ద తీరం తాకింది. అక్కడి నుంచి పెథాయి తన దిశ మార్చుకుని ఈశాన్య మార్గంలో పయనించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ తుఫాను ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాల్లోనూ తన ప్రభావం చూపుతుందని అన్నారు. పశ్చిమ బంగాలో కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారుల అంచనా. దీంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లోద్దని సూచించింది.