పశ్చిమాసియా దేశాల్లో ప్రధానిమోడీ పర్యటన

 

PM Modi-1
Narenda mody

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మూడుదేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. గల్ఫ్‌ప్రాంతంలోని పాలస్తీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఓమన్‌దేశాల్లో ప్రధాన మంత్రి వచ్చేనెల రెండునుంచి తొమ్మిదివ తేదీవరకూ పర్యటిస్తారు. 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలస్తీనాకు మోడీ మొట్టమొదటి పర్యటనగా వచ్చేనెలలో వెళుతున్నారు. అలాగే పాలస్తీనా రాజధానిగా వ్యవహరిస్తున్న రామల్లాహ్‌లో కూడా పర్యటిస్తారు. గత ఏడాది మోడీ ఇజ్రాయిల్‌లో పర్యటించిన తర్వాత రామల్లాహ్‌కు రావడం కూడా ఇదే మొదటిసారి అవుతుంది. ఇజ్రాయిల్‌ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆరురోజుల భారత్‌ పర్యటన అనంతరం పాలస్తీనా పర్యటన ఖరారయింది. ఈ రెండుదేశాలతో దౌత్యసంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోడీ పాలస్తీనా పర్యటనచేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో భారత్‌కు వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌కు కూడా మోడీ విందునిచ్చారు. భారత్‌,ఇజ్రాయిల్‌,పాలస్తీనా విధానాలు వేటికవే స్వతంత్రంగా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పేందుకే ఈపర్యటనఅని విదేశాంగ శాఖ వెల్లడించింది. బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌లోపర్యటించినా, ఇజ్రాయిలీ దౌత్య వేత్తలు తమ నిరసనను భారత్‌కు తెలియజేసినా సరే ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలెంగా నిర్ణయిస్తూ డొనాల్డ్‌ట్రంప్‌ప్రకటించడాన్ని బారత్‌వ్యతిరేకించింది. ఇక మోడీ తన పర్యటనలో పాలస్తీనాతోపాటు సౌదీఅరేబియాలో జరుగనునన ప్రపంచ ప్రభుత్వాల సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సుకు ఆయన గౌరవ అతిధి హోదాలో వస్తున్నారు. ఎమిరేట్స్‌కు మోడీ రెండోపర్యటన అని విదేశాంగశాఖ వెల్లడించింది. 2015 ఆగస్టులో మోడీ ఒకసారి యుఎఇ పర్యటించారు. ఇక తన పర్యటనలో చివరిగా మోడీ ఓమన్‌దేశంలో పర్యటిస్తారు. హిందూమహాసముద్ర కార్యాచరణ కమిటీలో భారత్‌కు కూడా సభ్యత్వం ఉన్నందునమోడీ ఓమన్‌పర్యటనకువెళుతున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌,ఓమన్‌రెండు దేశాలు కూడా భారత్‌ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో కీలకంగా ఉంటాయి. లెక్కకుమించిన సంఖ్యలో భారతీయులుఈరెండుదేశాల్లో ఉపాధిపొందుతూ వారు తమ రాబడులను భారత్‌లోని తమకుటుంబాలకు పంపిస్తున్నారు. పెట్టుబడులపరంగా కూడా యుఎఇ భారత్‌కు మూలవనరుగా నిలిచింది.