పవన్ ,చంద్రబాబుల భేటీ వివ‌రాలు

pawan
pawan

 

గ‌న్న‌వ‌రం: ఉద్దానం కిడ్నీ సమస్యపై జనసేన నేత పవన్ కల్యాణ్, హార్వర్డ్ వైద్య బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం
ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న జనసేన నేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఉద్దానం కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని పీడిస్తూ వుంది, వ్యాధికి సరైన కారణాలు ఇతమిత్ధంగా ఇంతవరకు కనుగొనలేకపోయారు, ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది.
వ్యాధిగ్రాస్థులకు ఉపశమనం కల్పించే అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంది.
పవన్ కల్యాణ్ ఈ అంశంపై చొరవ తీసుకోవడం ముదావహం, హార్వార్డ్ వైద్య పరిశోధక బృందం ఇచ్చే విలువైన సూచనలు పరిగణనలోకి తీసుకుని ఉభయులం సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఉధ్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రెజెంటేషన్
కిడ్నీ వ్యాధిగ్రస్థులను గుర్తించి ముందస్తుగా వ్యాధి నివారణ చేపట్టడానికి 7 మండలాల్లో 15 ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు.
ఒక వైద్యుడు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, టెస్టింగ్ కిట్స్‌తో కూడిన బృందాలు
176 గ్రామాల్లోని 30 ఏళ్ల పైబడిన అందరికీ ఈ వైద్య బృందాల ద్వారా వైద్య పరీక్షలు
15.4.2017 వరకు ఈ వైద్య బృందాల ద్వారా 1,01,593 వైద్య పరీక్షల నిర్వహణ
వీరిలో 13,093 మందికి వ్యాధి ఉన్నట్టు నిర్ధరణ. వీరిలో 7,032మంది పురుషులు, 6,003మంది మహిళలు.
మొత్తం జనాభాలో 13 శాతం మందికి వ్యాధి ఉన్నట్టుగా నిర్ధరణ.
కిడ్నీ వ్యాధి చికిత్స నిమిత్తం ఉద్ధానం ప్రాంతంలో 3 ప్రత్యేక డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు
మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కమ్యూనిటీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకం
దీని ద్వారా బాధితులు విశాఖ కేజీహెచ్‌కు వెళ్లవలసిన అవసరం లేకుండా ఎక్కడికక్కడే వైద్య నిర్ధరణ, చికిత్సలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిడ్నీవ్యాధిపై సమగ్ర పరిశోధన
వి.కొత్తూరు మండలంలోని గునుపల్లి గ్రామంలో అధ్యయనం జరిపిన ఎయిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం
కిడ్నీ బాధితులకు రూ. 2,500 నెలవారీ పెన్షన్ అందజేయాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది: పూనం మాలకొండయ్య
ఉద్ధానం ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్
నీటిలో సిలికా, స్ర్టోటియం, గ్యాలియం శాతం ఎక్కువగా ఉండటం వ్యాధికి ఒక కారణం
సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం మరో కారణం.
అధిక ఉష్ణ వాతావరణంలో పనిచేస్తూ సరిపడినంత నీరు తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికావడం
పెయిన్ కిల్లర్స్ మందులను అధికంగా వాడటం
వీటి వల్లే కిడ్నీ వ్యాధి ప్రభావం కనిపిస్తున్నట్టు పేర్కొన్న వైద్య నిపుణులు
ప్రధానంగా తాగునీటిలో సిలికా ప్రభావం కనిపించడం వల్లే వ్యాధి వ్యాపించినట్టు గుర్తింపు
రూ.17.30 కోట్ల వ్యయంతో ఉద్ధానం ప్రజానీకానికి పరిశుద్ధ జలాలు అందించే ఆర్వో ప్లాంట్లు
ఈ ఆర్వో ప్లాంట్ల ద్వారా 147 గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు
తొలుత ఈ ఏడాది జనవరి 28న 5 మండలాలలో ప్రజలకు రూ. 10.69 కోట్లు వ్యయంతో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు.
పలాస, వి.కొత్తూరు, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో తొలుత ప్రాజెక్టుల ఏర్పాటు
మిగిలిన 2 మండలాల్లోని మరో 7 చోట్ల 7 ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి ఆదేశాలు
2 రూపాయిలకు 20 లీటర్ల శుద్ధ నీటి జలాలను ‘ఎన్టీఆర్ సుజల’ పేరుతో అందిస్తున్నాం
ఉద్ధానం కిడ్నీ సమస్య్య పరిష్కారానికి జరిపిన అధ్యయనం, సిఫారసులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రజెంటేషన్